Begin typing your search above and press return to search.

బ్యాడ్ గాళ్ కే చెమ‌ట‌లు ప‌ట్టించేసిన యాంక‌రు

By:  Tupaki Desk   |   12 Jun 2021 4:30 AM GMT
బ్యాడ్ గాళ్ కే చెమ‌ట‌లు ప‌ట్టించేసిన యాంక‌రు
X
నేటిత‌రం స్పీడున్న‌ యాంక‌ర్ల‌లో అన‌సూయ‌.. రేష్మి గౌత‌మ్ .. శ్రీ‌ముఖి వీళ్లంద‌రిదీ ఒక రేంజు. ఇటీవ‌ల‌ రేస్ లోకి చేరింది మ‌రో యాంక‌ర్ విష్ణు ప్రియ భీమ‌నేని. ఈ అమ్మ‌డు రెగ్యుల‌ర్ గా ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ యూత్ కి కిక్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌నిలో ప‌నిగా త‌న డ్యాన్సింగ్ వీడియోల‌తోనూ ప్రియ ఇప్పుడు ట్రెండింగ్ గా మారుతున్నారు.

సాహో ఫేం `బ్యాడ్ గాళ్` జాక్విలిన్ ఫెర్నాండెజ్ అద్భుత‌ డ్యాన్సులతో అల‌రించిన ఓ హిందీ గీతానికి విష్ణు ప్రియ డ్యాన్సింగ్ మూవ్ మెంట్స్ కిరాక్ పుట్టించాయి. నాభి అందాల్ని ఎలివేట్ చేస్తూ విష్ణు ప్రియ బెల్లీ డ్యాన్స్ ల‌తో చెల‌రేగిపోయింది. నడుము ఊపుల‌తో ఒక ర‌కంగా జాక్విలిన్ కి అయినా చెమ‌ట‌లే అన్నంత‌గా ఈజ్ తో ఆక‌ట్టుకుంది.

ఇత‌ర యాంక‌ర్ల‌తో పోటీప‌డుతూ ఈ భామ కూడా వెండితెర అవ‌కాశాల కోసం గాలం వేస్తున్నారు. రోజుకు 2 నుంచి 4ల‌క్ష‌ల వ‌రకూ ఆర్జ‌న‌కు ఆస్కారం ఉన్న న‌ట‌నారంగంపై విష్ణుప్రియ మ‌నసు పారేసుకున్నార‌ట‌. `పోరా పోవే` షోతో బాగా పాపుల‌రైన ఈ తెలుగు యాంక‌ర్ ఇంత‌కుముందు కొన్ని చిన్నా చిత‌కా సినిమాల్లోనూ న‌టించింది. యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హాట్ యాంక‌ర్ గా పాపుల‌రైంది.