Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వండ‌ర్ `యాంక‌ర్` ఉమెన్

By:  Tupaki Desk   |   15 May 2021 10:54 AM GMT
ఫోటో స్టోరి: వండ‌ర్ `యాంక‌ర్` ఉమెన్
X
ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ట్రెండీ యాంక‌ర్ గా పాపుల‌ర‌వుతోంది విష్ణుప్రియ‌. ఓవైపు బుల్లితెర హోస్ట్ గా రాణిస్తూనే మ‌రోవైపు సినీనాయిక‌గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న ఈ బ్యూటీ అందుకు త‌గ్గ‌ట్టే సోష‌ల్ మీడియాల్లో ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప‌నిలో ఉంది.

తాజాగా బ్లాక్ లెద‌ర్ జాకెట్ లో విష్ణు ప్రియ స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే సిరీస్ లో ఈ భామ వండ‌ర్ ఉమెన్ గెట‌ప్ తో మైండ్ బ్లాక్ చేసింది. నిజానికి బుల్లితెర‌పై చూసిన విష్ణు ప్రియేనా? అని యూత్ షాక్ కి గుర‌య్యేంత డిఫ‌రెంట్ మేకోవ‌ర్ ని ఈ గెట‌ప్ లో చూపించింది.

మోచేతుల‌కు ఆ క‌వ‌చం.. నుదిటిన ఆ వండ‌ర్ ఉమెన్ సింబ‌ల్.. అలాగే రెడ్ జాకెట్ పై డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ లోగో ఇదంతా చూస్తుంటే రియ‌ల్ వండ‌ర్ ఉమెన్ నే త‌ల‌పిస్తోంది. నిజానికి హాలీవుడ్ లో గాల్ గాడోట్ కి ఆ అవ‌కాశం ద‌క్కినా.. తెలుగులో అలాంటి ప్ర‌య‌త్నం చేస్తే ఈ అమ్మ‌డికే ఆఫ‌ర్ ఇవ్వాలి అన్నంత‌గా క‌నెక్టయిపోయింది. ఇక ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ఫిక్ష‌న‌ల్ వెబ్ సిరీస్ ల‌లో న‌వ‌త‌రం న‌టీమ‌ణుల‌కు అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. మ‌రి విష్ణు ప్రియ మ‌ల్టీ లింగువల్ లెవ‌ల్లో అలాంటి ప్ర‌య‌త్నం చేస్తుందేమో చూడాలి. మ‌యూఖం అనే మ‌ల‌యాళ చిత్రంలో న‌టించిన విష్ణు ప్రియ చెక్ మేట్ అనే తెలుగు చిత్రంలోనూ న‌టించింది. ఇంత‌కుముందు టాలీవుడ్ లో చిన్నా చిత‌కా రోల్స్ చేసింది.