Begin typing your search above and press return to search.

మంచు బాబు తమిళ పోస్టర్ వదిలాడు

By:  Tupaki Desk   |   1 Oct 2017 6:02 AM GMT
మంచు బాబు తమిళ పోస్టర్ వదిలాడు
X
ఓవైపు తెలుగులో నిలదొక్కుకోవడానికి స్ట్రగులవుతూనే మంచు విష్ణు తమిళ మార్కెట్ మీద దృష్టిపెట్టాడు. కొన్ని నెలల కిందట జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో విష్ణు తెలుగు-తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్ర తెలుగు వెర్షన్ కంటే ముందు తమిళ వెర్షన్ ప్రి లుక్ పోస్టర్ లాంచ్ చేయడం విశేషం. ఈ చిత్రానికి ‘కుర్జల్-388’ అనే టైటిల్ పెట్టారు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా ఉంది ప్రి లుక్ పోస్టర్ చూస్తుంటే. త్వరలోనే దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేయనున్నారు. తెలుగు టైటిల్ కూడా కొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు.

బీరువా.. ఎక్స్ ప్రెస్ రాజా.. జెంటిల్ మన్ సినిమాల కథానాయిక సురభి ఇందులో విష్ణు సరసన నటిస్తోంది. ఓ కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలోనే ‘సరదా’ అనే సినిమా మొదలుపెట్టాడు విష్ణు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి ఈ ద్విభాషా చిత్రం మొదలుపెట్టాడు. విష్ణు మరోవైపు నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ అనే కామెడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలేషియాలో ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా గాయపడి కొన్నాళ్ల పాటు షూటింగ్ కు దూరమైన విష్ణు.. ఈ మధ్యే కోలుకుని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాడు. బ్రహ్మానందం కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటిస్తోంది.