Begin typing your search above and press return to search.

ఢీ గ్యాంగ్ డి అండ్ డి .. కామెడీ యాక్ష‌న్ లో డ‌బుల్ డోస్

By:  Tupaki Desk   |   23 Nov 2020 11:00 AM IST
ఢీ గ్యాంగ్ డి అండ్ డి .. కామెడీ యాక్ష‌న్ లో డ‌బుల్ డోస్
X
ఢీ గ్యాంగ్ మ‌ళ్లీ క‌లిశారు. ఓ సినిమా చేసేందుకు చేతులు క‌లిపారు. విష్ణు మంచు - శ్రీను వైట్ల కలయికలో 13 సంవత్సరాల తరువాత తిరిగి ఓ సినిమా చేస్తున్నారు అన్న ప్ర‌చారంతో ఇటీవ‌ల అభిమానుల్లో ఫిలింస‌ర్కిల్స్ లో‌ ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. ఢీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఈ జోడీ నుంచి వ‌చ్చింది. ఇప్పుడు అంత‌కుమించి తీస్తారా? అన్న చ‌ర్చా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో సాగింది. ఆ క్ర‌మంలోనే ఢీ సీక్వెల్ తీయ‌నున్నార‌ని అంచ‌నా వేసారు అభిమానులు.

అందుకు సింబాలిక్ గా ఉండే టైటిల్ నే ప్ర‌క‌టించారు. డి & డి (D & D) టైటిల్ కాగా... దీనికి డబుల్ డోస్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు డి & డి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. డబుల్ డోస్ ఉప‌శీర్షిక‌తో ఢీ ఫ్రాంచైజీలోని మొదటి చిత్రం కంటే డబుల్ డోస్ యాక్షన్ కామెడీ ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆస‌క్తిక‌రంగా టైటిల్ రెండ‌క్ష‌రాలు భేడీల‌తో ముడిప‌డి క‌నిపించ‌డం చూస్తుంటే ఇది ఖైదీల న‌డుమ కామెడీనా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో విష్ణు మంచు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. అవరం భక్త మంచు దీనిని సమర్పిస్తున్నారు. ఢీ స‌హా అనేక బ్లాక్ బస్టర్లలో భాగమైన శ్రీను వైట్ల అభిమాన రచయిత గోపి మోహన్ మ‌రోసారి వైట్ల‌తో క‌లిసి ఈ మూవీ కోసం ప‌ని చేస్తున్నారు. ప్రముఖ రచయిత కిషోర్ గోపుతో కలిసి గోపీమోహ‌న్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. యువ సంచలనం మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నారు. మోహనా కృష్ణ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

భారతదేశం నంబర్ వన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ని మ‌రోసారి విష్ణు టీమ్ బ‌రిలో దించారు. ఎం.ఆర్.వర్మ ఎడిటర్ కాగా.. చిన్నా ఆర్ట్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. హీరోయిన్.. ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.