Begin typing your search above and press return to search.
'మోసగాళ్లు' వచ్చేది ఎప్పుడు?
By: Tupaki Desk | 12 Nov 2020 9:45 AM ISTమంచు విష్ణు.. కాజల్ బ్రదర్ సిస్టర్ గా నటించిన మోసగాళ్లు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. రెగ్యులర్ కమర్షియల్ మూవీగా కాకుండా ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ మరియు వీడియోల ద్వారా క్లారిటీ వచ్చింది.
సంక్రాంతికి సినిమాలు చాలా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో విడుదలకు సిద్దం అయ్యి ఆగిపోయిన సినిమాలన్నీ కూడా సంక్రాంతికే అంటూ ఇప్పటికే ప్రకటన చేశాయి. డిసెంబర్ లో థియేటర్లు నడిస్తే సంక్రాంతి వరకు జనాలు థియేటర్ల దారి పడితే అప్పుడు వరుసగా పెద్ద చిన్న సినిమాలు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. జనవరిలో ఇప్పటికే పది సినిమాలు వస్తాయంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. మరి వాటికి పోటీగా ఈ సినిమా వస్తుందా లేదా కాస్త ఆలస్యంగా ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తారా అనేది చూడాలి.