Begin typing your search above and press return to search.

విష్ణు కోసం వంట‌ల‌క్క‌గా మారిన స‌న్నిలీయోన్!

By:  Tupaki Desk   |   21 April 2022 10:30 AM GMT
విష్ణు కోసం వంట‌ల‌క్క‌గా మారిన స‌న్నిలీయోన్!
X
ఇటీవ‌లి కాలంలో మంచు విష్ణు-స‌న్నిలియోన్ ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అన్న‌ది ఓ వీడియో ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విష్ణుని స‌న్నిలియోన్ ఆట ప‌ట్టిస్తూ ఓ వీడియో చేసారు. అందులో ఇద్ద‌రు ఒక‌రు వెంబ‌డి ఒక‌రు ప‌రుగులు తీసిన ఫ‌న్నీ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో వైర‌ల్ అయింది. ఆ ఒక్క వీడియో ద్వారా ఇద్ద‌రు ఎంత మంచి స్నే హితులు అన్న‌ది అర్ధ‌మైంది.

తాజాగా నెట్టింట మ‌రో వీడియో వైర‌ల్ అవుతుంది. ఈసారి ఏకంగా స‌న్నిలియోన్ విష్ణు కోసం వంట గ‌దిలోకే దూరింది. విష్ణు కోసం ప‌రోటాలు చేసింది. స్వ‌యంగా స‌న్న‌లియోన్ మైదా పండి పిసికి...ప‌రోటాలు త‌యారు చేసి నూనేలో వేపి మ‌రి రుచి చూపించింది. ఈ క్ర‌మంలో స‌న్నిలియోన్ ప‌రోటాలు చేస్తుంటే విష్ణు ప‌క్క‌నే ఉండి ఆమెని ఆట‌ప‌ట్టించ‌డం స‌ర‌దాగా ఉంది. ఇద్ద‌రు ఎంచ‌క్కా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ వంట‌ల కార్య‌క్ర‌మాన్ని ముగించారు. మ‌ధ్య‌లో విష్ణు రెండు కోడిగుడ్లు కూడా ఇచ్చి స‌మ్ థింగ్ కొత్త‌గా ట్రై చేయ‌మ‌ని కుకింగ్ స‌ల‌హాలు ఇస్తున్నాడు.

దీనికి స‌న్నిలియోన్ ఎలా చేయాల‌ని స‌ల‌హాలు అడ‌గ‌డం..వాటికి విష్ణు స‌మాధానాలు ఇవ్వ‌డం చాలా ఫ‌న్ తో కూడుకున్న‌ది. ఇందులో గుంటూరు..క‌ర్నూలు శైలి స్లాంగ్ ని స‌న్న‌లియోన్ తో ప‌లికించ‌డం మ‌రో ఎత్తు. `దీనెక్క ప‌రోటో అదిరిపోయింది` అనే ప‌దాన్ని స‌న్నిలియోన్ త‌న‌దైన బ‌ట్ల‌ర్ తెలుగులో చెబితే మామూలుగా లేదు మ‌రి .

ఇక వీడియో లో మ‌రో ఆస‌క్తిర సంగ‌తేంటి? అంటే స‌న్నిలియోన్ అచ్చ తెలుగు ఆడ‌ప‌డుచులా ముస్తాబైంది. లంగావోణి ధ‌రించి ప‌ల్లైటూరి అమ్మాని త‌ల‌పిచింది. అలాగే అంద‌మైన పొడ‌వైన జ‌డ‌ వేసుకుంది. అప్పుడ‌ప్పుడు విష్ణు-స‌న్ని ఒక‌ర్నిఒక‌రు కొట్టుకోవ‌డం..గిల్లికోవడం..గిచ్చుకోవ‌డం వంటివి కూడా వీడియోలో గ‌మ‌నించాల్సిన అంశాలు.

మ‌రి ఈ వీడియో ఎక్క‌డైనా గెస్ట్ హౌస్ లో షూట్ చేసారా? లేక నేరుగా విష్ణు ఇంటి కిచెన్ లోకే ఆహ్వానించి వంట‌ల కార్య‌క్ర‌మం పెట్టారా? అన్న‌ది తెలియాల్సిన అంశం. ఏది ఏమైనా స‌న్నిలియోన్ తో విష్ణు ఇలాంటి వీడియో లు చేసి నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నారు. ఇక స‌న్నిలియోన్ గ‌తంలో మ‌నోజ్ హీరోగా తెర‌కెక్కిన‌ `క‌రెంట్ తీగ` సినిమాలో గెస్ట్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.