Begin typing your search above and press return to search.
విశాల్ సినిమా రిలీజ్ ఆగిన కారణం ఇదేనా?
By: Tupaki Desk | 10 May 2019 11:31 PM ISTహీరో విశాల్ తాజా చిత్రం 'అయోగ్య' షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మే 10 న రిలీజ్ కావలిసి ఉంది. దానికి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. కానీ లాస్ట్ మినిట్ లో సినిమా రిలీజ్ ఆగిపోయింది. విశాల్ సినిమాతో పాటు రిలీజ్ కావాల్సిన నాలుగు సినిమాల్లో మరో మూడు సినిమాలకు రిలీజ్ ఇబ్బందులే తలెత్తాయట. ఈమధ్య తమిళనాట సినిమా రిలీజ్ లో ఫిలిం మేకర్లు ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా కామన్ అయిపోయింది.
తమిళంలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు నిర్మాతల మండలి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే కొందరు ఫిలిం మేకర్స్ ఈ నిబంధనను పాటించడం లేదట. కానీ విశాల్ సినిమాకు మాత్రం ఆల్రెడీ NOC వచ్చేసింది. దీంతో ఈ సినిమాకు ఫైనాన్స్ సమస్యల కారణంగానే రిలీజ్ ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు. ఈ విషయం పై స్పందించిన విశాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు కానీ అసలు కారణం ఏంటని మాత్రం వెల్లడించలేదు.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో "నేను ఎప్పటికీ వదిలి పెట్టను. అయోగ్య నాకు ఒక ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక సామాజిక సమస్య మీద తెరకెక్కించిన చిత్రం. #రేప్ కు మరణ శిక్ష కాన్సెప్ట్ తో సినిమాను తీయడం నాకో గొప్ప అవకాశం. నేను ఈ సినిమాను చేసినందుకు గర్విస్తున్నాను. ఈ సినిమా తప్పనిసరిగా వస్తుంది." అంటూ మరో ట్వీట్ పెట్టాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ఫైనాన్స్ సమస్యలే కారణమని.. ఈ విషయంపై నిర్మాతలైన స్టూడియో గ్రీన్ వారికి డిస్ట్రిబ్యూటర్లకు మధ్య సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయని అవి కొలిక్కి రాగానే సినిమాను రిలీజ్ చేస్తారని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.