Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ స్టెప్స్.. విశాల్ కు గాయమైందట!

By:  Tupaki Desk   |   11 March 2019 6:32 AM GMT
బ్లాక్ బస్టర్ స్టెప్స్.. విశాల్ కు గాయమైందట!
X
హీరోలు తెరపై కష్టమైన స్టెప్స్ వేస్తుంటే ప్రేక్షకులు వాటిని థియేటర్లో చూస్తూ విజిల్స్ వేస్తారు కానీ ఆ డ్యాన్స్ కు వెనక చాలా కష్టం దాగి ఉంటుంది. కొంతమంది హీరోలు పాటలలో డ్యాన్స్ వేయకుండా అలా నడుస్తూ ఉంటారు కదా.. అలాంటి వాకింగ్.. స్టాండింగ్ స్టెప్స్ వేసేవారి గురించి కాదు ఈ ఉపోద్ఘాతం. నిజంగా కష్టమైన స్టెప్స్ వేసే హీరోల గురించి. రీసెంట్ గా హీరో విశాల్ అలా ఒక పాట చిత్రీకరణ సమయంలో డ్యాన్స్ చేస్తూ గాయాలయ్యాయని సమాచారం.

విశాల్ ప్రస్తుతం 'అయోగ్య' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' సినిమాకు రీమేకే ఈ 'అయోగ్య'. ఈ సినిమాకోసం అల్లు అర్జున్ సినిమా 'సరైనోడు' లోని 'బ్లాక్ బస్టర్' పాటను వాడుకుంటున్నారు 'అయోగ్య' మేకర్స్. ఈ పాటకు అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్స్ వేస్తాడో తెలిసిందే. మంచి డ్యాన్స్ నంబర్ కావడంతో విశాల్ కూడా కష్టమైన స్టెప్స్ వేసేందుకు రెడీ అయ్యాడట. షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ గాయాలపాలయ్యాడట. మోచేయి వాయడంతో పాటుగా కాలికి కూడా గాయం అయిందట. దీంతో 'అయోగ్య' టీమ్ పాట చిత్రీకరణను ఆపినట్టు సమాచారం. విశాల్ మళ్ళీ నార్మల్ అయిన తర్వాత పాట చిత్రీకరణను పూర్తి చేస్తారట.

ఈ సినిమాలో విశాల్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ తమిళ నటుడు పార్తిబన్ ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నతీస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు వెంకట్ మోహన్. విశాల్.. కేఈ జ్ఞానవేల్ రాజాలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.