Begin typing your search above and press return to search.
విశాల్ మేనేజర్ కారు ధ్వంసం.. ఆమెపై కేసు
By: Tupaki Desk | 9 July 2020 4:00 PM ISTహీరో విశాల్ ఇటీవల పలు వివాదాస్పద విషయాల కారణంగా మీడియాలో ఉంటున్నాడు. ఆమధ్య నడిగర్ సంగం ఆతర్వాత నిర్మాతల మండలి వివాదాల కారణంగా విశాల్ చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలోనే విశాల్ ప్రొడక్షన్ ఆఫీస్ లో దాదాపు 45 లక్షల రూపాయలు గోల్ మాల్ జరిగినట్లుగా విశాల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రమ్య అనే మహిళపై మేనేజర్ హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనపై కేసు నమోదు అవ్వడంతో రమ్య మీడియా ముందుకు వచ్చి విశాల్ బండారం బయట పెడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో విశాల్ మేనేజర్ హరి కారు ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
రమ్య తన కారును ధ్వంసం చేసి ఉంటుంది అంటూ హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా పెద్ద విషయంగా చర్చ జరుగుతోంది. అసలు విశాల్ విషయంలో ఎం జరుగుతోంది అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.