Begin typing your search above and press return to search.

విశాల్ కోసం 300

By:  Tupaki Desk   |   12 Jan 2022 9:30 AM IST
విశాల్ కోసం 300
X
విశాల్ హీరోగా ఏ వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'లాఠీ'. ఈ సినిమా లో హై ఓల్టేజ్ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. విశాల్ అంటేనే యాక్షన్‌ హీరోగా ఆయన అభిమానుల్లో భావన ఉంది. అందుకే అభిమానుల అంచనాలకు తగ్గకుండా లాఠీ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. విశాల్ ను సరికొత్తగా చూపించడంతో పాటు యాక్షన్‌ సన్నివేశాలతో ఒల్లు గగురు పొడిచేలా అభిమానులను మరియు ప్రేక్షకులను సర్ ప్రైజ్‌ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక విషయం వైరల్‌ అయ్యింది.

లాఠీ సినిమా కోసం ఒక భారీ యాక్షన్‌ సన్నివేశంను పీటర్ హెయిన్స్ సారధ్యంలో షూటింగ్ జరిగింది. ఆ యాక్షన్‌ సన్నివేశం సినిమాలో అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు. అందుకే ఏకంగా 300 మంది ఫైటర్స్ తో షూటింగ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. పీటర్ హెయిన్స్ గతంలో ఇలాంటి ఎన్నో భారీ ఫైట్స్ కు కొరియోగ్రఫీ చేసిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఈ ఫైట్ కూడా ఆయన అద్బుతంగా వచ్చేలా డిజైన్‌ చేశాడని.. మూడు వందల మందితో హీరో ఫైటింగ్ అంటే అతి అనిపించకూడదు.. అలాగే హీరోయిజం ను ఎలివేట్‌ చేయాలి. అలా చేస్తేనే ఫైట్‌ బాగుందని ప్రేక్షకులు అంటారు. కనుక హీరోయిజం ను అద్బుతంగా ఎలివేట్‌ అయ్యేలా మూడు వందల మంది ఫైటర్స్ తో పీఠర్ హెయిన్స్ షూటింగ్‌ చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

విశాల్ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. ఈ సంక్రాంతికి సామాన్యుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతి సినిమాలు విడుదల వాయిదా పడటంతో సామాన్యుడు కు మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. కొన్ని రోజుల క్రితం విశాల్‌ మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్న విశాల్‌ ను లాఠీ సినిమాలో ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశాల్‌ ప్రతి సినిమా కూడా తెలుగు లో డబ్‌ అవుతుంది. కనుక లాఠీ కూడా తెలుగు లో డబ్‌ అవ్వడం ఖాయం. కనుక ఆ 300 మంది ఫైటర్స్ తో విశాల్‌ ఫైటింగ్‌ ను చూసేందుకు యాక్షన్‌ ప్రియులు సిద్దంగా ఉండండి.