Begin typing your search above and press return to search.

విశాల్ ను ఇరికించిన చరణ్

By:  Tupaki Desk   |   2 April 2018 12:13 PM IST
విశాల్ ను ఇరికించిన చరణ్
X
తమిళనాట సినిమాల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. మార్చ్ 16 నుంచి తీవ్ర రూపం దాల్చిన సమ్మె ఎప్పటికి తెగుతుందో అర్థం కాక సీనియర్ దర్శక నిర్మాతలు సైతం తలలు పట్టుకు కూర్చుకున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల చార్జీల వివాదం మొదలుకుని ఎగ్బిటర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసే విధంగా నిర్మాతలంతా కలిసికట్టుగా షూటింగులు సైతం ఆపేసి నిరసన తెలియజేస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడం ఇవన్ని ముందుండి నడిపిస్తున్న విశాల్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. సమ్మెలో థియేటర్ల యాజమాన్యాలు కూడా పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించినప్పటికీ మల్టీ ప్లెక్స్ లు అది పాటించడం లేదు. ఇతర బాషా సినిమాలతో పాటు పాత తమిళ సినిమాలు వేసుకునే వెసులుబాటు ఉండటంతో ఏదో ఒకరకంగా పబ్బం గడుపుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని పర బాషా చిత్రాలను అదే పనిగా విడుదల చేయటం ఇప్పుడు విశాల్ కు తలనెప్పిగా మారింది.

తమిళ్ సినిమాలు మాత్రమే వేయకూడదు కాని తెలుగు-కన్నడ-మలయాళం-హింది-ఇంగ్లీష్-మరాటి-బెంగాలీ సినిమాలు వేసుకోవచ్చు. కాబట్టి వాటినే ఇప్పుడు థియేటర్ యజమానులు అవకాశంగా తీసుకుంటున్నారు. మొన్న శుక్రవారం విడుదలైన రంగస్థలం చెన్నై తో సహా తమిళనాడు మొత్తం భారీ ఎత్తున విడుదల కావడమే కాక ఒక తమిళ్ స్టార్ హీరో రేంజ్ బిల్డప్ ఇవ్వడంతో ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తున్నాయి. దానికి తోడు సినిమా సబ్జెక్టు తమిళీయులకు బాగా కనెక్ట్ అయ్యే 80ల నాటి గ్రామీణ నేపధ్యం కావడంతో బాష అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ తో చూసేస్తూ చరణ్ ని బాగానే ఆదరిస్తున్నారు.

ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేసి సమ్మె చేస్తూ ఉంటె ఇలా పక్క బాషా సినిమాలు ఆడించడం వల్ల మనకు ఒరిగేదేమని ఇప్పుడు నిర్మాతలు విశాల్ ను నిలదీస్తున్నారు. ఇప్పుడు వాటిని ఎలా అడ్డుకోవాలి అనే దాని గురించి విశాల్ తీవ్ర సమాలోచనలు చేస్తున్నట్టు టాక్. ఒకవేళ సమ్మె ఇప్పటిలో ఆగకపోతే 20న వచ్చే భరత్ అనే నేనుకు తమిళనాడులో ఇబ్బందులు ఎదురు కావొచ్చు. మరి విశాల్ ఈ ఛాలెంజ్ ను ఎలా ఫేస్ చేసి పర బాషా నిర్మాతలను ఒప్పిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.