Begin typing your search above and press return to search.

కబాలి కూతురు తప్పేం లేదు -విశాల్

By:  Tupaki Desk   |   30 Sept 2017 11:27 AM IST
కబాలి కూతురు తప్పేం లేదు -విశాల్
X
విళితిరు మూవీ ప్రెస్ మీట్ విషయంలో జరిగన రగడ గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. ఈ సినిమాలో ఓ పాట పాడిన సీనియర్ దర్శక నిర్మాత టి. రాజేందర్ పేరును.. హీరోయిన్ ధన్సిక ప్రస్తావించకపోవడంతో.. ఆయన సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అవమానించే ఉద్దేశ్యం లేదని.. పొరపాటు మర్చిపోయానని కబాలి కూతురు ఏడుస్తూ చెప్పినా.. తెగ తిట్టిపోశాడు టి. రాజేందర్. తమిళనాట హాట్ టాపిక్ గా మారిన ఈ ఇష్యూపై ఇప్పుడు హీరో విశాల్ స్పందించాడు.

"దర్శకుడు టి రాజేందర్.. మిస్ ధన్సికను స్టేజ్ మీదే టార్గెట్ చేయడం గురించి తెలిసింది. ఆమె క్షమాపణలు చెబుతున్నా ఆయన పట్టించుకోలేదు. టి. రాజేందర్ ఓ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. ఒక స్టేజ్ పై ఒకరిద్దరు పేర్లు మర్చిపోవడం సహజం. నాకు కూడా చాలాసార్లు ఇలానే జరిగింది. పేరు చెప్పడం మర్చిపోయినందుకు ధన్సిక ఏకంగా ఆయన కాళ్ల మీద పడిపోయినా.. టీఆర్ మాత్రం తన కూతురుతో సమానమైన వయసు గల ఆమెను క్షమించలేకపోయారు. ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహిళ ఎదగడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేయలేదని మేము నమ్ముతున్నాం. టీఆర్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె అప్పటికప్పుడే క్షమాపణలు చెప్పిన విషయాన్ని టీఆర్ గుర్తించాలి" అని స్టేట్మెంట్ ఇచ్చాడు విశాల్.

అయితే.. విశాల్ ఇక్కడ హీరోగా కాకుండా తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా.. సౌత్ ఇండియా సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో.. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి వస్తుంది.