Begin typing your search above and press return to search.

ఇప్పుడీ రిలీజ్ ఎవరికి లాభం విశాల్ ?

By:  Tupaki Desk   |   6 July 2019 4:22 PM IST
ఇప్పుడీ రిలీజ్ ఎవరికి లాభం విశాల్ ?
X
జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ ఇటీవలే విశాల్ హీరోగా తమిళ్ లో అయోగ్య పేరుతో రీమేక్ అయ్యి బాగానే ఆడిన సంగతి తెలిసిందే. దీని షూటింగ్ మొదలుకాక ముందే అయోగ్యను తెలుగులో డబ్బింగ్ చేయమని తారక్ తో పోలిక విషయంలో తాను పోటీ పడలేనని విశాల్ ఒప్పుకోవడం ఇంకా గుర్తే. అయితే అదంతా తూచ్ అనేసి అయోగ్యను తెలుగులోకి డబ్ చేసి ఈ నెల 12న హడావిడిగా విడుదల చేయబోతున్నారు.

క్లైమాక్స్ లో ఓ పది నిముషాలు తప్ప మిగిలినదంతా టెంపర్ ని మక్కికి మక్కి తీసిన అయోగ్య మనవాళ్లకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువే. ఎంత క్లైమాక్స్ ని మార్చి ట్రాజెడీ టచ్ ఇచ్చినా దాని కోసమే ఖర్చు పెట్టుకుని మరీ చూసేంత సాహసం ఆడియన్స్ చేస్తారా అనేది అనుమానమే. పైగా డబ్బింగ్ చేయము అని చెప్పిన విశాల్ మరి హక్కులు ఎలా అమ్మనిచ్చాడో తనకే తెలియాలి. అసలే 12న విపరీతమైన పోటీ ఉంది.

దొరసాని-నిను వీడని నీడను నేనే-రాజ్ దూత్ లతో పాటు హృతిక్ రోషన్ సూపర్ 30 అదే రోజు ఒకేసారి దాడి చేయబోతున్నాయి. మొన్న వచ్చిన ఓ బేబీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది కాబట్టి స్క్రీన్లు ఎక్కువ శాతం కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అయోగ్యను తీసుకురావడం అంటే సాహసమే. అభిమన్యుడు సక్సెస్ తో తన మార్కెట్ ని కొద్దిగా కోలుకునేలా చేసిన విశాల్ ఇలాంటి ప్రయత్నాలతో మరింత తగ్గించుకోవడం తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు. తెలుగులో కాజల్ అగర్వాల్ చేసిన పాత్రను అయోగ్యలో రాశి ఖన్నా వేసింది