Begin typing your search above and press return to search.

టెంపర్ ని ఇప్పుడు కాపీ అంటున్నారే

By:  Tupaki Desk   |   13 May 2019 10:40 AM IST
టెంపర్ ని ఇప్పుడు కాపీ అంటున్నారే
X
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో చాలా స్పెషల్ మూవీగా నిలిచిపోయిన టెంపర్ తమిళ్ లో అయోగ్య పేరుతో రీమేకై మొన్న విడుదలైన సంగతి తెలిసిందే. టాక్ డీసెంట్ గా ఉండటంతో పాటు వసూళ్లు బాగానే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ తెలుగులో చేసిన పాత్రను తమిళ్ లో పార్తీబన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో టెంపర్ కథను తన పాత సినిమా నుంచి స్ఫూర్తిగా తీసుకుని చేసారని కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

పార్తీబన్ స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐశ్వర్య హీరోయిన్ గా 1993లో ఉల్లే వెలియే అనే సినిమా వచ్చింది. పక్కా మాస్ మసాలా కమర్షియల్ సినిమా. లైన్ నిజంగానే టెంపర్ కు కాస్త దగ్గరగానే ఉంటుంది. బోల్డ్ గా తీయడంతో పాటు నాటుగా బూతులు జోడించడం అప్పట్లో విమర్శలు గుప్పించినా బొమ్మ హిట్టు కొట్టి డబ్బులు తెచ్చింది

దీన్నే అనిల్ కపూర్ హీరోగా హిందీలో మిస్టర్ ఆజాద్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ మాత్రం ఫ్లాప్ అయ్యింది. తెలుగులో పార్తీబన్ సినిమానే డబ్బింగ్ చేసి వదిలితే బాగానే ఆడింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత పార్తీబన్ దీని గురించి చెప్పడం విశేషం. క్రిటిక్స్ తో పాటు నెటిజెన్లు సైతం పోలికలు గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంటే వక్కంతం వంశీ కథకు స్ఫూర్తి అక్కడ ఉందన్న మాట.

ఇది కాకతాళీయంగా జరిగిందో మనవాళ్లకు గుర్తులేదని వంశీ తెలివిగా అందులో మెయిన్ లైన్ ని తీసుకున్నాడో తెలియదు కానీ పూరి టేకింగ్ తారక్ పెర్ఫార్మన్స్ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిసి టెంపర్ ని క్లాసిక్ చేశాయి. అయోగ్య ఆ స్థాయిలో ఆడుతుందో లేదో కానీ దీని పుణ్యమా అని టెంపర్ కు ఓ లింక్ అయితే దొరికింది