Begin typing your search above and press return to search.
'విరాటపర్వం' ఓటీటీ డీల్ ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 18 Jun 2022 11:30 AM GMTరానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించి లేటెస్ట్ మూవీ 'విరాటపర్వం'. కరోనా కారణంగా కొంత కాలం వాయిదా పడిన ఈ మూవీ ఆ తరువాత భారీ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ కారణంగా వాయదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా జూన్ 17న శుక్రవారం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేర్లలోకి వచ్చేసింది. రిలీజ్ డిలే కావడంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ ఏముంది ఈ మూవీలో? .. ఎందుకు రిలీజ్ ఆపుతున్నారు? అని సర్వత్రా చర్చ నడిచింది.
అయితే ఎట్టకులకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయి పల్లవి నటించడంతో ఈ మూవీకి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అంతే కాకుండా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.
తొలి రోజు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్ల పరంగా మాత్రం ఆ స్థాయి ఫలితాన్ని రాబట్టలేదని తెలుస్తోంది. నటన పరంగా సాయి పల్లవి వెన్నెల పాత్రలో ఆకట్టుకున్నా జనాలు భారీ స్థాయిలో థియేటర్లకు రాలేదని, షోస్ ఫుల్స్ కాలేదని తెలుస్తోంది.
అయితే వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవికి మాత్రం ఈ మూవీతో అవార్డు గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి తాజాగా బయటికి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఓటీటీ డీల్ ని ఫినిష్ చేసుకుందని, పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని భారీ మొత్తానికి సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని 15 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ మూవీ టీమ్ కి ఓటీటీ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ రూపంలోనూ భారీ మొత్తం సొంతమయ్యే అవకాశాలు వున్నాయని ఇన్ సైడ్ టాక్.
ఈ మూవీని ఉత్తర తెలంగాణ లో 1990 లో జరిగిన ఓ యదార్థ గాథ ఆధారంగా తెరకెక్కించారు. నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ఈ వీకెండ్ టెస్ట్ ని దాటుకుని ఏ స్థాయి వసూళ్లని రాబడుతుందో వేచి చూడాల్సిందే.