Begin typing your search above and press return to search.

తెలుగు ఇండియన్ ఐడల్ కోసం విరాటపర్వం.. మెగాస్టార్‌

By:  Tupaki Desk   |   11 Jun 2022 6:30 AM GMT
తెలుగు ఇండియన్ ఐడల్ కోసం విరాటపర్వం.. మెగాస్టార్‌
X
సింగింగ్ షో అనగానే అందరికి గుర్తుకు వచ్చే షో ఇండియన్ ఐడల్‌. ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రమే కాకుండా చాలా మంది సౌత్ ప్రేక్షకులకు కూడా ఇండియన్ ఐడల్‌ అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది.

ఉత్తరాది ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో తెలుగు వారు గెలిచిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆహా వారు తెలుగు ఇండియన్‌ ఐడల్ ను షురూ చేసిన విషయం తెల్సిందే.

తెలుగు ఇండియన్ ఐడల్‌ షో ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల ఎపిసోడ్స్ కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరు కాగా గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. తెలుగు బిగ్ బాస్ రెండు సీజన్ ల గ్రాండ్‌ ఫినాలేకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆ ఎపిసోడ్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు మెగా స్టార్‌ చిరంజీవి తెలుగు ఇండియన్ ఐడల్ షో యొక్క గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. అతి త్వరలోనే ఆహా లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన స్టిల్స్ ను విడుదల చేశారు. అందులో చిరంజీవి తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీని ఆవిష్కరించాడు.

చిరంజీవితో పాటు విరాటపర్వం చిత్ర యూనిట్‌ సభ్యులు అయిన రానా మరియు సాయి పల్లవి కూడా ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంకు హాజరు అయ్యారు. విరాట పర్వం సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగానే సాయి పల్లవి మరియు రానా కలిసి తెలుగు ఇండియన్ ఐడల్‌ స్టేజ్ పై సందడి చేశారు.

మెగా స్టార్‌ తో పాటు లేడీ పవర్‌ స్టార్‌ అంటూ పేరు దక్కించుకున్న సాయి పల్లవి కూడా కనిపించడంతో తెలుగు ఇండియన్ ఐడల్ షో పై అంచనాలు భారీగా పెరిగాయి. తప్పకుండా ఇప్పటి వరకు వచ్చిన రేటింగ్ కంటే అత్యధిక రేటింగ్‌ ఈ ఎపిసోడ్‌ కు వచ్చే అవకాశం ఉందని ఆహా టీమ్‌ చాలా నమ్మకంతో ఉన్నారు.