Begin typing your search above and press return to search.

విరాటపర్వం.. కథలో శక్తిమంతమైన పాత్రలన్నీ వారివే!

By:  Tupaki Desk   |   19 Oct 2020 3:40 PM IST
విరాటపర్వం.. కథలో  శక్తిమంతమైన పాత్రలన్నీ వారివే!
X
టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సినిమాల్లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో విరాటపర్వం ఒకటి. ' నీది నాది ఒకే కథ' అంటూ తొలి చిత్రాన్నే ఒక ప్రత్యేక చిత్రంగా మలిచిన వేణు ఉడుగుల విరాట పర్వంపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తుండగా సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. 90ల నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో రానా తో పాటు హీరోయిన్ సాయి పల్లవి పాత్రలు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారంట. సాయిపల్లవి సినిమాలో జానపద గాయని గా, కొంత పార్ట్ నక్సలైట్ గా కనిపించనున్నారు. అప్పటి రాజకీయ కథాంశం నేపథ్యంలో ఈ సినిమాను వేణు ఆసక్తిగా మలుస్తున్నారట.

ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇందులోని ప్రధాన పాత్రలన్నీ స్త్రీలవే. హీరోయిన్ సాయి పల్లవి తో పాటు, నందితా దాస్, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీ రావులవి శక్తివంతమైన పాత్రలుగా ఉంటాయని తెలుస్తోంది. వారి పాత్రలు ఇందులో కీలక మైనవి అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో రానాతో హీరోయిన్ సాయి పల్లవి, ప్రియమణి లుక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రియమణి నక్సలైట్ పాత్రల్లో ఒదిగిపోయి అద్భుతంగా కనిపించింది. హీరో రానా బాహుబలి సినిమా తర్వాత వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మరి విరాట పర్వం చిత్రం ఆయన కెరీర్ లో ఎలాంటి చిత్రం అవుతుందో చూడాల్సి ఉంది.