Begin typing your search above and press return to search.

సాయి పల్లవి స్టార్‌ డంకు ఈ రేటే నిదర్శణం

By:  Tupaki Desk   |   3 March 2021 7:30 AM GMT
సాయి పల్లవి స్టార్‌ డంకు ఈ రేటే నిదర్శణం
X
మలయాళం ప్రేమమ్‌ సినిమా తో సౌత్‌ ప్రేక్షకులకు పరిచయం అయ్యి తెలుగు 'ఫిదా' ఆడియన్స్ ను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం టాప్ హీరోయిన్‌ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమా లు చేస్తున్న ఈ అమ్మడు సమ్మర్‌ లో బ్యాక్ టు బ్యాక్‌ సినిమా లతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. నాగ చైతన్య తో నటించిన లవ్ స్టోరీ మరియు రానాతో కలిసి నటించిన విరాటపర్వం సినిమా లు విడుదల తేదీలు కూడా వచ్చేశాయి. ఈ రెండు సినిమా లకు కూడా భారీ బిజినెస్‌ జరుగుతోంది. సాయి పల్లవి హీరోయిన్‌ అవ్వడం వల్ల కాస్త ఎక్కువ మొత్తం బిజినెస్‌ అవుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.

రానా హీరోగా నటించిన 'విరాటపర్వం' సినిమా ను ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ వారు ఏకంగా 10 కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. రానా సినిమా ఆ రేంజ్ లో బిజినెస్ చేయడం అంటే కాస్త ఆశ్చర్యంను కలిగించే విషయం. సాయి పల్లవి హీరోయిన్‌ గా నటించడం వల్ల సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా విరాటపర్వం సినిమా డబ్బింగ్‌ వర్షన్‌ ను ప్రేక్షకులు ఆసక్తిగా చూసే అవకాశం ఉంటుంది. అందుకే నెట్‌ ఫ్లిక్స్ వారు సాయి పల్లవి కారణంగా విరాటపర్వంకు అంత భారీ మొత్తంను ఆఫర్‌ చేసి ఉంటారు అనేది మీడియా వర్గాల టాక్‌. నాగచైతన్య లవ్‌ స్టోరీ పరిస్థితి కూడా అంతే. మొత్తానికి ఈ నెంబర్స్‌ చూస్తుంటే సాయి పల్లవి రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.