Begin typing your search above and press return to search.

అప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయిందట!

By:  Tupaki Desk   |   1 July 2019 10:22 AM GMT
అప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయిందట!
X
విభిన్నమైన కథలు.. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తన కెరీర్ లో ముందుకు సాగిపోతున్న హీరో రానా దగ్గుబాటి. హీరోయిన్ సాయి పల్లవి కూడా అంతే.. పాత్రల ఎంపికలో ఎంతో శ్రద్ధ చూపిస్తుంది. అలాంటి ఇద్దరు ఒక సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తుండడం ఒక గొప్ప విషయం. వారు అలా జోడీ కట్టిన సినిమానే 'విరాటపర్వం'.

90 ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. అంతలోనే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. తెలంగాణాలోని ధరిపల్లి గ్రామంలో ఈ మొదటి షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. ఇప్పటికే ఈ షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా లీక్ అయిన ఫోటోల్లో లో లంగా ఓణీలో ఉన్న సాయి పల్లవి సైకిల్ తొక్కుతూ ఉంది. రెండు జడలతో న్యాచురల్ లుక్ లో కనిపిస్తోంది.

ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలకపాత్రలో నటిస్తోంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి. 'నీది నాది ఒకే కథ' ఫేం వేణు ఉడుగుల ఈ మూవీకి దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్లపై డి. సురేష్ బాబు.. సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.