Begin typing your search above and press return to search.

అబ్బే!! ఎంగేజ్మెంట్ లేదంట

By:  Tupaki Desk   |   30 Dec 2016 4:23 PM IST
అబ్బే!! ఎంగేజ్మెంట్ లేదంట
X
''మా ఎంగేజ్మెంట్ ఏమీ జరగట్లేదు. ఒకవేళ జరుగుతుంటే మాత్రం.. దాచుకోవాల్సిన అవసరం లేదు. మీకు న్యూస్ ఛానళ్లు తప్పుడు రూమర్లను అందించకుండా ఉండలేవు కాబట్టి.. ఆ రూమర్లకు క్లయ్ మ్యాక్స్ నేనిస్తున్నాను'' అంటూ ట్వీటేశాడు భారత క్రికెట్ కెప్టెన్ విరాట కొహ్లీ. ఈరోజు ఉదయం నుండి రిషికేశ్‌ లో సెక్సీ హీరోయిన్ అనుష్క శర్మ అండ్ విరాట్ కొహ్లీల నిశ్చితార్దం జరుగుతుందంటూ రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే డెహ్రాడున్ చేరుకుని.. అక్కడి నుండి విరాట్ అండ్ అనుష్కలు రిషికేశ్‌ వెళ్ళారు. అయితే ఇప్పుడు ఇదే పవిత్ర తీర్ధానికి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. అలాగే ముకేష్‌ అంబానీ కూడా వెళ్లడంతో.. కొంపతీసి అక్కడి గుడిలో ఏదైనా ఎంగేజ్మెంట్ జరుగుతుందా ఏంటీ అంటూ మీడియా ఊహాగానాలూ స్టార్ట్ అయిపోయాయ్. అయితే దానికి కొంత మసాలా కలిపేసి.. మనోళ్లు వెంటనే ఎంగేజ్మెంట్ స్టోరీని ఏకంగా భారీ బ్లాక్ బస్టర్ రేంజులో టివిల్లో వేసేశారు. సడన్ గా ఇవన్నీ తెలిసిన విరాట్ షాకైపోయాడట. అందుకే అలా కామెంట్లు చేశాడు.

ఇకపోతే ఒక న్యూస్ ఏజెన్సీకి టచ్ లోకి వచ్చిన అనుష్క శర్మ కూడా.. తనకు అప్పుడే ఎంగజ్మెంట్ గట్రా చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పేసింది. సో.. అప్పుడే వీరి రిలేషన్ తదుపరి లెవెల్ కు వెళ్లట్లేదనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/