Begin typing your search above and press return to search.

అర్ధనగ్నంగా కోహ్లీ హితబోధ

By:  Tupaki Desk   |   5 Sept 2019 4:31 PM IST
అర్ధనగ్నంగా కోహ్లీ హితబోధ
X
ప్రపంచకప్ లో ఘోర ఓటమి తర్వాత కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తీసేయాలన్న డిమాండ్ మాజీల నుంచి వినిపించింది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ తాజాగా ఆ సిరీస్ ను ఘనవిజయంతో ముగించారు. టెస్ట్, వన్డే, టీ20ల్లో క్లీన్ స్వీప్ చేసి విజయబావుటా ఎగురవేశారు. తనపై చేసిన విమర్శలకు ఆటతో సెంచరీలు చేసి సమాధానమిచ్చారు.

వెస్టిండీస్ లో అన్ని సిరీస్ లను టీమిండియా గెలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంతో ఉన్నాడు. ఈ కోవలోనే యువ ఆటగాళ్లు బాగా ఆడడంపై సంతోషం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ టూర్ లో కనుక టీమిండియా ఓడిపోతే విరాట్ పని అయిపోయేది. అందుకే కసిగా ఆడి గెలిచాడు.

వెస్టిండీస్ పర్యటన ముగియగానే కోహ్లీ వెకేషన్ కు వెళ్లిపోయాడు. తనకిష్టమైన విదేశాల్లో సేదతీరుతున్నాడు. తాజాగా ఓ ఫొటో షూట్ లో ఒంటిపై కేవలం నిక్కరుతో ఫొటోలకు ఫోజిచ్చాడు. ఆ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన విరాట్ తన బాధనంతా ఒక్క మెసేజ్ లో వెళ్లగక్కాడు.. ‘మనకున్న పరిమితుల్లోనే మనం జీవించగలిగితే.. బయటి నుంచి ఏదీ అవసరం లేదు’ అంటూ హితబోధ చేశారు.

దీన్ని బట్టి టీమిండియాలో తన ప్రపంచకప్ ఓటమి తర్వాత కోహ్లీ ఎంతో ఎమోషనల్ అయ్యాడని.. ఆ కోవలోనే ఇలా హితబోధ వ్యాఖ్యలు చేశాడని అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.