Begin typing your search above and press return to search.

కోహ్లీ బయోపిక్ లో హీరో ఎవరో తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   18 May 2020 6:20 PM IST
కోహ్లీ బయోపిక్ లో హీరో ఎవరో తెలిస్తే షాకే
X
క్రికెట్ అంటే భారత్ లో ఒక మతం.. క్రికెట్ అంటే దేశంలోని జనాలకు ప్రాణం.. క్రికెట్ లేని భారత్ ను అస్సలు ఊహించలేం. ఐపీఎల్ అయినా.. ఇండియన్ క్రికెట్ అయినా పిచ్చిగా చూస్తారు.. ప్రపంచ క్రికెట్ లో భారత్ నుంచి చూస్తే రెండు అద్భుత ఘట్టాలు.. ఒకటి కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 లో ప్రపంచకప్ గెలవడం.. ఆ తర్వాత ఎంఎస్ ధోని నేతృత్వంలో 2011లో ఇదే ప్రపంచకప్ ను ముద్దాడడం. ఈ రెండు విజయాలు ప్రపంచ క్రికెట్ లోనే మరుపురాని ఘట్టాలు..ఇద్దరూ లెజెండ్సే.. కపిల్, ధోని కష్టపడి పైకి వచ్చారు. అందుకే వారిద్దరి బయోపిక్స్ రెడీ అయ్యాయి.

ధోని బయోపిక్ కు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తాజాగా కపిల్ దేవ్ పాత్రపోషిస్తూ నాటి 1983 ప్రపంచకప్ గెలిచిన కపిల్ సారథ్యంలోని టీంపై బయోపిక్ ను తీస్తున్నారు. అదే‘83’ సినిమాకి ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా దేశంలో ఈ పరిస్థితి లేకుంటే ఎప్పుడో విడుదలయ్యేది.

ధోని బయోపిక్ దేశంలో బంపర్ హిట్ అయ్యింది. వందల కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ ఆడింది. ధోని జీవితంలో ప్రేమ, విషాదం, కష్టాలు, కడగండ్లు ఉండడం సినిమాకు బాగా లాభించింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సచిన్’ బయోపిక్ డాక్యుమెంటరీగా ఉండడంతో జనం చూడలేదు. ఫ్లాప్ అయ్యింది. అజహర్ బయోపిక్ కూడా అంతే.

ఇప్పుడు తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ రాబోతోందట.. ఈ మేరకు ట్విట్టర్ లో కోహ్లీ లైవ్ చాట్ లో ఆసక్తికరంగా స్పందించాడు. తన బయోపిక్ తీస్తే తనే హీరోగా ఉంటానని.. అయితే హీరోయిన్ గా తన భార్య అనుష్క శర్మ అయితే ఓకే చెబుతానని షరతు పెట్టాడు. దీంతో కోహ్లీ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి బాలీవుడ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందా.. కోహ్లీనే స్వయంగా నటిస్తే సినిమా హిట్ అవుతుందా? కోహ్లీ జీవితంలో కావాల్సిన సినిమా మసాలా ఉందా? ధోని బయోపిక్ లా వర్కవుట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.