Begin typing your search above and press return to search.

వైరల్ : నాన్న విధుల్లో విరాట్ కోహ్లీ బీజీ

By:  Tupaki Desk   |   22 March 2021 2:48 PM GMT
వైరల్ : నాన్న విధుల్లో విరాట్ కోహ్లీ బీజీ
X
ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ ఫాం కోల్పోయి తంటాలు పడడానికి సరిగ్గా ఆడకపోవడానికి కారణాలేంటని చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. కానీ ఆయన సంసార సాగరంలో ఈదుతూ అదనపు బాధ్యతలతో ఒత్తిడితో ఆడలేకపోతున్నాడని మాజీలు సైతం దెప్పిపొడిచారు.తాజాగా ఇంగ్లండ్ తో టెస్టుల్లో విఫలమైన కోహ్లీ టీ20లో ఫాంలోకి వచ్చాడు. గెలిపించాడు. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం ఫూణేకు కోహ్లీ వచ్చాడు. వీరికోసం బీసీసీఐ ప్రత్యేక చార్టెడ్ ఫ్లయిట్ ను కేటాయించింది.

భారత కెప్టెన్ కోహ్లీ కరోనా టైంలో భార్య పిల్లలతోనే కలిసి ఉంటున్నాడు. బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో హోటల్స్ లో కోహ్లీ తన భార్య అనుష్క, కూతురుతో ఉంటున్నాడు. తాజాగా అహ్మదాబాద్ నుంచి ఫూణేకు వస్తుండగా నాన్న విధుల్లో కోహ్లీ కనిపించాడు. అనుష్క శర్మ కూతురు వామికను ఎత్తుకోగా.. విరాట్ వారి హ్యాండ్ బ్యాగులు, క్రికెట్ కిట్, కూతురును తీసుకెళ్లే క్యారీకోట్ మోస్తూ కెమెరాలకు చిక్కాడు.

ఫూణే విమానాశ్రయంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వామిక ఫొటోలు ఇంతవరకు షేర్ చేయలేదు. ఇప్పుడు కూడా వామిక కనిపించకుండా అనుష్క చాలా జాగ్రత్తగా టవల్ తో కవర్ చేసింది.