Begin typing your search above and press return to search.
ప్రొఫైల్ పిక్చర్ తో మొత్తం చెప్పేశాడుగా..
By: Tupaki Desk | 15 April 2017 3:25 PM ISTఈ మధ్యకాలంలో ఎవరైనా సిన్సియర్ లవ్వర్లు ఉన్నారా అంటే.. ఖచ్చితంగా కూడా హీరోయిన్ అనుష్క శర్మ మరియు భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నిసార్లు గొడవలు వచ్చినా కూడా.. చక్కగా మళ్లీ కలసిపోయి.. హ్యాపీగా కలసి తిరుగుతూ.. రిలేషన్ షిప్ గోల్స్ అంటే ఇలా ఉండాలి అన్నట్లు చూపిస్తున్నారు వీరిద్దరూ.
ఇకపోతే మొన్న వాలెంటైన్స్ డే నాడు.. ఓపెన్ గా సోషల్ మీడియాలో అనుష్క శర్మకు శుభాకాంక్షలు తెలిపాడు విరాట. నువ్వు ప్రక్కనుంటే ప్రతిరోజూ వాలెంటైన్స్ డే నాకు అని చెప్పాడు. ఆ తరువాత ఉమెన్స్ డే నాడు.. తన జీవితంలో ఇద్దరి ఆడాళ్లు చాలా ముఖ్యమని.. ఒకటి అమ్మ ఇంకోటి అనుష్క శర్మ అంటూ చెప్పాడు. ఇప్పుడిక పంజాబి వారి నూతన సంవత్సరాది సందర్భంగా.. ఏకంగా అనుష్క శర్మతో కలసి ఉన్న ఫోటో ఒకటి ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టేశాడు. ఆ ఒక్క ఫోటో చూస్తే చాలుగా.. అసలు మనోడు ఏం చెప్పాలనుకున్నాడో క్లియర్ గా కన్వే అయిపోవడానికి.
నిజానికి గత ఏడాది వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారని వార్తలొచ్చాయి కాని.. అవేవీ నిజం కాలేదు. ఈ ఏడాది కూడా చేసుకునేలా కనిపించట్లేదు. ఒక ప్రక్కన కొత్తగా వచ్చిన కెప్టెన్సీతో కొహ్లి బిజీగా ఉంటే.. మరో ప్రక్కన ఏ-లిస్ట్ హీరోలతో సినిమాలు చేస్తూ అనుష్క బిజీగా ఉంది. త్వరలోనే ఈమె ఇంతియాజ్ ఆలీ తీస్తున్న సినిమాలో షారూఖ్ ఖాన్ హీరోయిన్ గా కనిపించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/