Begin typing your search above and press return to search.
34 కోట్లతో లవ్ బర్డ్స్ ఫ్లాట్ కొనుకున్నారు
By: Tupaki Desk | 20 Jan 2016 10:22 AM ISTఇండియాలో మోస్ట్ పాపులర్ ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ. చాలా ఓపెన్ గా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే వీరిద్దరి వ్యవహారం, చాలాసార్లు వివాదాలకు దారి తీసింది. వీళ్లిద్దరూ ఓ ఫ్లాట్ కొంటున్నారు. కాదు కాదు.. అనుష్కకి ఓ కాస్ట్లీ ఫ్లాట్ ని విరాట్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు.
ముంబైలో వర్లి అంటే అత్యంత ఖరీదైన ఏరియా. ఇక్కడ 8వేల చదరపు అడుగుల సువిశాలమైన ఫ్లాట్ ని బుక్ చేశారు. ఓంకార్ 1973 వర్లి ఆపార్ట్ మెంట్స్.. ఇది ఇప్పుడు నిర్మాణంలోనే ఉంది. ఇందులో సీ వింగ్ లో 35వ ఫ్లోర్ లో ఫ్లాట్ ని బుక్ చేశారు అనుష్క - విరాట్ లు. దీని ఖరీదు అక్షరాలా ముప్ఫై నాలుగు కోట్ల రూపాయలు. గతేడాది అక్టోబర్ లో అంటే ఇండియా - సౌతాఫ్రికాల మధ్య ఐదో వన్డే ప్రారంభానికి ముందు ఓంకార్ 1973 వర్లి అఫీసును సందర్శించారు వీరిద్దరూ. వీళ్లు బాంద్రా నుంచి ఓ రెస్టారెంట్ నుంచి బైటకొస్తూ కూడా ఫోటోలకు చిక్కారు.
మూడు నెలల తర్వాత ఇప్పుడీ ఫ్లాట్ ని రిజిస్టర్ చేయించుకున్నారు ఈ జంట. ఈ రిజిస్ట్రేషన్ విలువ 26.68 కోట్లు కాగా.. మొత్తం 34 కోట్లు ముట్టచెప్పాడు విరాట్. స్కై బంగ్లాస్ లో భాగమైన ఈ అపార్ట్ మెంట్ లో ఐదు బెడ్ రూమ్ లు ఉండగా.. అరేబియా సముద్రం కనిపించే వ్యూతో ఈ ఫ్లాట్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. 2017 చివరకు ఈ కన్ స్ట్రక్షన్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ కాంప్లెక్స్ లో స్పోర్ట్స్ పెవిలియన్ - స్పా వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి.