Begin typing your search above and press return to search.
ఇన్‌స్టా లో మోదీని క్రాస్ చేసిన విరాట్ కోహ్లీ
By: Tupaki Desk | 15 Dec 2020 12:52 PM ISTసోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సోషల్ మీడియా యాప్స్ లో ఇన్ స్టాగ్రామ్ అగ్రస్థానంలో దూసుకుపోతుంది. అత్యాధునికమైన ఫీచర్స్ తో చిన్న , పెద్ద అన్న తేడా లేకుండా అందరిని ఆకట్టుకుంటూ ముందుకుపోతుంది. ఇకపోతే ఈ ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ ఓ రికార్డ్ సృష్టించారు. ఇన్ స్టాగ్రామ్ ప్రభావశీల వ్యక్తుల్లో విరాట్ కోహ్లీ.. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ముందు వరుసలో ఉన్నాడు. హైప్ ఆడిటర్ జాబితా ప్రకారం, కోహ్లీ 12వ స్థానంలో ఉండగా, మోదీ 20వ స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో విరాట్ భార్య అనుష్క 26వ స్థానంలో నిలిచారు.
ఇన్ స్టా ప్రభావశీలుర జాబితాలో పోర్చుగీసు ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో టాప్‌లో నిలవగా.. అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ 4వ స్థానంలో ఉన్నాడు. బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెమార్ కు 13వ ర్యాంక్ దక్కింది. ఇండియా తరఫున కోహ్లీ తొలి స్థానంలో, ఆపై మోదీ, అనుష్క, దీపికా పదుకొనే తదితరులు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఇక , ఈ ఏడాది ట్విటర్‌లో అత్యధికంగా ప్రస్తావించిన భారత అథ్లెట్ గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల జాబితాలో ధోనీ, రోహిత్ శర్మను వెనక్కు నెట్టి విరాట్ ప్రథమ స్థానాన్ని అలంకరించాడు. కాగా, ట్విటర్ లో ఎక్కువగా ట్వీట్ చేసిన మహిళల్లో బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అత్యధిక లైక్ లను పొందిన ట్వీట్ గా, గత ఆగస్టులో తాను తండ్రిని కాబోతున్నానని కోహ్లీ చేసిన ట్వీట్ నిలిచింది.