Begin typing your search above and press return to search.
అనుష్కకు విరాట్ ప్రేమ సందేశం
By: Tupaki Desk | 1 May 2018 4:55 PM ISTఈ మధ్యకాలంలో భారతదేశం మొత్తం మాట్లాడుకున్న పెళ్లి ఏదైనా ఉంది అంటే అది విరుశ్క జంటదే అని చెప్పొచ్చు. గత డిసెంబర్ లో ఒక్కటైన ఈ కపుల్ వన్ అఫ్ ది మోస్ట్ ఫాలోవ్డ్ సెలెబ్రిటీస్ గా పేరు తెచ్చుకున్నారు. ఒకపక్క విరాట్ కోహ్లీ విజయాల పర్వం అటు అంతర్జాతీయ క్రికెట్ లోనూ ఇటు ఐపిఎల్ లోనూ కొనసాగుతూ ఉండగా టాలీవుడ్ లో సమంతా తరహాలో పెళ్లి జరిగినా తన క్రేజ్ ని ఇంచు కూడా తగ్గించుకోకుండా అనుష్క శర్మ క్రేజీ సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూనే ఉంది. అనుష్క శర్మ వయసు 30లోకి ఎంటర్ అయ్యింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని విరాట్ తను విష్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేసి తన జీవితంలో చూసిన అత్యంత నిజాయితి మరియు సానుకూలమైన వ్యక్తిగా అనుష్కను పేర్కొంటూ చేసిన మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇప్పటికే రెండు మిలియన్ల లైకులు కొట్టేసిన ఈ పిక్ కు ఫాన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి లవ్లీ కపుల్ ని చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంటూ వరసబెట్టి కామెంట్స్ పెట్టేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఐపిఎల్ లో బిజీ గా ఉండగా అనుష్క శర్మ సూయ్ దాగా తో పాటు జీరో షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి రెస్ట్ లో ఉంది. ఖాదీ ఉద్యమాన్ని పెంపొందించే కథాంశంతో రూపొందుతున్న సూయ్ దాగాలో అనుష్క చీరలు నేసే ఒక సాధారణ మహిళగా నటిస్తుండగా జీరోలో షారుఖ్ ఖాన్ సరసన సరికొత్త ఫాంటసీ తరహా పాత్రను పోషిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి భార్యభర్తలు వారి వారి వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్న జీవితంలోని అతి ముఖ్యమైన రోజులను మాత్రం మర్చిపోకుండా ఇలా సెలెబ్రేట్ చేసుకోవడం విశేషమే.