Begin typing your search above and press return to search.

పనులు వేరైనా.. ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   25 Aug 2017 10:00 PM IST
పనులు వేరైనా.. ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు
X
ఒకరు క్రికెటర్ మరొకరు హీరోయిన్. ప్రొఫెషన్స్ వేరైనా మనసులు ఎప్పుడు కలిసాయో గాని ఇండియాలో మోస్ట్ లవ్ బర్డ్స్ గా పెరు పొందుతున్న జంట అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ లో ఉన్నంత వరకు ఒకలా ఉన్న వీరిద్దరూ ఒకటయ్యాక మాత్రం ప్రేమ పక్షుల్లా విహార యాత్రలను తెగ చేస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కాస్త టైమ్ దొరికితే చాలు కలిసిపోతు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. నెల కూడా చూసుకోకుండా ఉండలేని ఈ ప్రేమ జంట ఎక్కడ బడితే అక్కడ దర్శనమిస్తూ.. వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు కెమెరా కంట పడ్డారో గాని ప్రస్తుతం అనుష్క-విరాట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడికి వెళ్లినా విరాట్ తప్పకుండా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనుష్క ని కలుసుకున్నానని చెబుతుంటాడు. కానీ ఈ సారి ఓ హోటల్ లో మీల్స్ లాగించేస్తూ.. ఓ కెమెరా కంట సీక్రెట్ గా చిక్కారు వీరిద్దరూ. దీంతో ఆ ఫొటో విరాట్ ఇన్ స్టాగ్రామ్ ఫ్యాన్స్ క్లబ్ పేజ్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం విరాట్ శ్రీలంక పర్యటనలో బిజినా ఉన్నాడు. అనుష్క కూడా షూటింగ్స్ లో బిజీగా వుంది. బహుశా మొన్న ఓ సారి విరాట్ టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు అనుష్క అక్కడికి వెళ్ళింది. సో అప్పుడు దిగిన ఫోటో అయ్యి ఉంటుందని తెలుస్తోంది.