Begin typing your search above and press return to search.

అనుష్కను ఎందుకు తిడతారో ఏంటో!!

By:  Tupaki Desk   |   4 Nov 2017 6:30 PM IST
అనుష్కను ఎందుకు తిడతారో ఏంటో!!
X
ఇండియన్ టీమ్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ బ్యూటీఫుల్ నటి అనుష్కల మధ్య ప్రేమ వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. అయితే మొదట కోహ్లీ అనుష్క తో సీక్రెట్ గా ప్రేమ వ్యవహారం నడపడంతో అందరూ కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇక కోహ్లీ ముఖ్యమైన మ్యాచులలో ఓడిపోతే చాలు అనుష్క పై కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. అయితే ఆ తరహా వ్యాఖ్యలు నన్ను చాలా సార్లు చాలా బాధకు గురి చేశాయని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతే కాకుండా ఆ విషయంలో జహీర్ ఖాన్ ఒక మంచి సలహా ఇచ్చినట్లు కూడా చెప్పుకొచ్చాడు.

బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌ అనే కార్యక్రమంలో భాగంగా విరాట్ తన జీవితంలోని అన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా అనుష్క విషయాన్ని కూడా ప్రస్తావించాడు. తన గురించి కొన్ని విషయాలని చెప్పిన అనంతరం బాధపడిన ఒక విషయం గురించి చెప్పాడు. అనుష్క 2014లో తనతో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ సిరీస్ లో సరిగ్గా ఆడలేకపోయాను. కానీ అప్పుడు అందరు అనుష్కను తిట్టారు. నేను మంచిగా ఆడిన సందర్భాల్లో కూడా తాను చాలా సార్లు ఉంది. ఇప్పటికి నేను సరిగ్గా అడకుంటే అనుష్కను ఎందుకు తిడతారో అస్సలు అర్థం కాదు. ఇక పచ్చబొట్లు, ఫ్యాషన్ అనే విషయాలపై దృష్టి మళ్లించి ఆటను మరిచాడని ఏవేవో రాసేవారు.

ఆ విషయాలన్నీ తనను చాలా బాధ కలిగించాయని అయితే ఆ సమయంలో ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తనకు ఒక మంచి సలహా ఇచ్చాడని చెప్పాడు. నువ్వు ఏదైనా చేస్తే దైర్యంగా అందరికి కనిపించేటట్టు చెయ్యి. అంతేగాని చాటు మాటుగా ఏ పని చెయ్యకు. ఎందుకంటే నువ్వు ఏ తప్పు పని చేయడం లేదు కదా అని జహీర్ ఖాన్ తనకు సలహా ఇచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యానని విరాట్ వివరించాడు. బహుశా అందుకేనేమో గాళ్ ఫ్రెండ్ తో కలసి చాలా ధైర్యంగా వీధులన్నీ షికార్లు కొట్టేస్తూ ఉంటాడు మన క్రికెట్ కెప్టెన్