Begin typing your search above and press return to search.
వైరల్ః 1975లో అభిమానులకు ఎన్టీఆర్ లేఖ!
By: Tupaki Desk | 29 May 2021 5:10 PM ISTనిన్న (మే 28) నందమూరి తారక రామారావు జయంతి. తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందిన వారిలో ఎన్టీఆర్ ఆగ్రస్థానంలో ఉంటారు. కేవలం నటుడిగానే కాకుండా.. రాజకీయ నాయకుడిగా సైతం చెరిగిపోని సంతకం చేశారు. 99వ జయంతి సందర్భంగా.. ఎంతో మంది ఆయన సేవలను స్మరించుకున్నారు.
అయితే.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. 1970వ సంవత్సరంలో స్వహస్తాలతో ఆయన అభిమానులకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రీన్ ఇంక్ పెన్ తో రాసిన ఆయన లేఖలో అభిమానులపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.
‘‘అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరు ప్రేమాను రాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు’’ అని లేఖను ముగించారు. 1975వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన ఈ లేఖను రాశారు ఎన్టీఆర్. ఆయన జయంతి సందర్భంగా బయటకు వచ్చిన ఈ లేఖ వైరల్ అయ్యింది.