Begin typing your search above and press return to search.

తొలి రోజే సీఎం జగన్ జీవో ఉల్లంఘన!

By:  Tupaki Desk   |   2 Dec 2021 4:31 PM GMT
తొలి రోజే సీఎం జగన్ జీవో ఉల్లంఘన!
X
న‌టసింహా నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం `అఖండ` గురువారం అత్యంత భారీగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. అయితే విడుదలకు ఒక రోజు ముందు జగన్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం తన మునుపటి ప్రభుత్వ ఉత్తర్వును (జిఓ నంబర్ 35) మెయిన్ స్ట్రీమ్ .. సోషల్ మీడియా సర్కిల్ లో మళ్లీ ప్రచారం చేసింది.

జీవోలో చాలా సంగ‌తులే ఉన్నాయి. వివిధ థియేటర్లలో - సింగిల్ స్క్రీన్ నాన్-ఎసి థియేటర్ ల నుండి AC థియేటర్ ల నుండి గ్రామ పంచాయితీలలో మల్టీప్లెక్స్ ల నుండి నగర పంచాయితీలు మునిసిపాలిటీలు .. మునిసిపల్ కార్పొరేషన్ లలో సవరించిన సినిమా టిక్కెట్ రేట్లకు సంబంధించినది. ఈ థియేటర్లలో గ్రామ పంచాయతీల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కనిష్టంగా రూ.5 నుంచి నగరపాలక సంస్థల్లోని మల్టీప్లెక్స్ లలో గరిష్టంగా రూ.250 వరకు టిక్కెట్ ధరలు నిర్ణయించారు.

అదే సమయంలో రాష్ట్ర సమాచార - ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని గత వారం రాష్ట్ర అసెంబ్లీలో రోజుకు నాలుగు షోలకు మించి ప్రదర్శించడానికి థియేటర్లను అనుమతించబోమని ప్రకటించారు. మంగళవారం అన్ని థియేటర్లకు ఇదే సందేశం పంపారు. అన్ని స్థాయిలలోని థియేటర్ లు నిర్ణీత ధరలను అనుసరించాలని నొక్కిచెప్పాలనే ఉద్ధేశ్యంతో జీవో పునఃప్రసారం చేసినా.. `అఖండ` విడుదలైన మొదటి రోజునే ఆర్డర్ ని ఉల్లంఘించారు. థియేటర్లలో ప్రారంభ గంటల్లోనే సినిమాను ప్రదర్శించారు. అర్ధరాత్రి వరకు అదనపు షోలకు వెళ్తున్నారని గ్రౌండ్ నుండి లీకులందాయి. అంతేకాదు ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టిక్కెట్ల ధరలను ఎవరూ పాటించడం లేదని కొన్ని చోట్ల రూ.400 వరకు టిక్కెట్టు రేట్ తో విక్రయించార‌ని టాక్ వ‌చ్చింది. అయితే ఇండస్ట్రీ పెద్దలతో అందరూ (అధికారులు) చేతులు కలిపినప్పుడు ఎవరు చర్యలు తీసుకుంటారు. ముందుగా థియేటర్ల ద్వారా జీఓ ఉల్లంఘిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడానికి కొంతమంది సీనియర్ అధికారులు ప్ర‌య‌త్నించార‌ట‌.

ఇక జగన్ కు ఒక్కో థియేటర్ ని తనిఖీ చేసే సమయం ఉండదు. సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరనున్నారు. కానీ అమలు చేసే అధికారులు- రెవెన్యూ అధికారుల నుండి పోలీసుల వరకు స్వయంగా జీవోను ఉల్లంఘించడంపై మౌనం వహిస్తే.. ఇప్పుడు ఆ బాధ్య‌త ఎవ‌రిది? కంచే చేను మేస్తే ఇక దిక్కేది? అన్న చందం అయ్యింది ఈ జీవో ప‌రిస్థితి.

స‌మోసా అయినా కొన‌లేని రేటు ఇది!

అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా థియేటర్ లకు రేట్లు సరిపోవు కాబట్టి జిఓ అమలులో ఆచరణ సాధ్యం కాదని అధికారుల నుండి సినిమా పరిశ్రమ వరకు అందరికీ తెలుసు. డిస్ట్రిబ్యూటర్ వాటా- ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం తప్ప ఈ ధరలతో థియేటర్ల విద్యుత్ ఛార్జీలను కూడా వసూలు చేయలేరని థియేటర్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో కనీస టిక్కెట్ ధర రూ. 5 లేదా పట్టణాల్లో రూ. 10తో మనం ఇంకేదైనా కొన‌గల‌మా? ఏమి లభిస్తుంది? ఈ మొత్తంతో మాకు సమోసా లేదా కప్పు టీ కూడా లభించదు. ఈ రోజుల్లో పాప్ కార్న్‌కు కనీసం రూ. 25 ఖర్చవుతోంది.. అని ఆయన ప్రశ్నించారు. కార‌ణం ఏదైనా కానీ తొలి రోజు జ‌గ‌న్ జీవో ఉల్లంఘ‌న జ‌రిగింది.