Begin typing your search above and press return to search.
రేఖను చెప్పుతో కొట్టి పంపింది ఎవరు?
By: Tupaki Desk | 27 Sept 2016 3:41 PM ISTరేఖ... ఒకప్పటి స్వప్నసుందరి. ఓ దశలో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. అయితే, తెరపై రేఖ ఎంత సంచలనమో ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా అదే స్థాయి ట్విస్టులు ఉన్నాయి. రేఖ వ్యక్తిగత జీవితం గురించి గతంలో రకరకాల కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించి ఎన్నో సంచలనాలు ఉన్నాయి. రేఖ జీవితంలోకి సంచలనాలను బయపెడుతూ ఇప్పుడు సంచలనం అవుతోంది ఆమె ఆత్మకథ! "రేఖ... ద అన్ టోల్డ్ స్టోరీ" అనే పుస్తకాన్ని యాస్మిన్ ఉస్మాన్ రాశారు. బయట ప్రపంచానికి తెలియని ఘటనలు ఎన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె పెళ్లి వ్యవహారానికి సంబంధించిన ఘటనలు ఆసక్తికరంగా ఉన్నాయి.
అప్పట్లో వినోద్ మెహ్రాను రేఖ పెళ్లి చేసుకుంది. అత్తగారింటికి పెళ్లి దండలతో రేఖ వెళ్లింది. ఆమెని చూడగానే మంగళ హారతులు పట్టి ఇంట్లోకి కుడికాలు పెట్టిస్తూ అత్తగారు ఆహ్వానిస్తారు అని కలలు కంటూ మెట్టినింటి గడప తొక్కింది. అయితే, రేఖను పెళ్లి చేసుకోవడం వినోద్ మెహ్రాకి మాత్రమే ఇష్టం - అతడి తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు! దాంతో రేఖ పేరు వినగానే మండిపడే వినోద్ తల్లి - ఆమె కోడలిగా వస్తోందని తెలిసి ఆగ్రహంతో రగిలిపోయింది. పెళ్లి చేసుకుని గుమ్మం ముందుకొచ్చి నిలబడిన రేఖను చెడామడా తిట్టేసింది. నచ్చజెప్పడానికి రేఖ ఎంత ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు. చివరికి చెప్పుతో కొట్టి మరీ రేఖను ఆ ఇంటి నుంచి వెళ్లగొట్టింది. వినోద్ మెహ్రా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.
ఈ ఘటన బయట ప్రపంచానికి తెలీదు. అలానే రేఖ - అమితాబ్ ల ప్రేమ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. ఈ వ్యవహారంలో రేఖ చాలా రకాలుగా అవమానాలు పాలైంది. ఇలాంటి ఎన్నో అవమానాలూ - చీత్కారాలు - సత్కారాలూ ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చి సంచలనం రేకెత్తిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/