Begin typing your search above and press return to search.

ఆ సీనియర్ స్టార్ హీరో కన్నీళ్లకి కారణం ఏమిటి

By:  Tupaki Desk   |   23 Feb 2022 1:30 AM GMT
ఆ సీనియర్ స్టార్ హీరో కన్నీళ్లకి కారణం ఏమిటి
X
తెలుగు ప్రేక్షకులకు వినోద్ కుమార్ బాగా తెలుసు. అప్పట్లో మంచి ఒడ్డూ పొడుగుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఆయన ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఇతర హీరోల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ తనకంటూ కొన్ని హిట్లను దక్కించుకున్నాడు. 'మౌనపోరాటం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన, తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత వచ్చిన 'మామగారు' .. 'సీతారత్నంగారి అబ్బాయి' సినిమాలు ఆయనకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి.

హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా అడపా దడపా తెలుగు తెరపై కనిపిస్తున్నాడు. అయితే ప్రేక్షకులు ఆయనను మరిచిపోలేదు. ఆయన గురించి తెలుసుకోవాలనే కుతూహలంతోనే ఉన్నారు. ఆయన కెరియర్ కి సంబంధించిన ముచ్చట్లను పంచుకోవాలనే ఆసక్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హీరోగా తన జర్నీకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగతమైన విషయాలను కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది.

అలీ అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ .. "మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో ఒక ఐదు సినిమాల వరకూ చేశాను. ఆయనకి కావాల్సింది పెర్ఫెక్షన్ .. కోపం వస్తే ఫైల్ విసిరికొట్టేవారు. అందువలన కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవలసి వచ్చేది. ఇక దాసరి నారాయణరావుగారు .. కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో నటించే అవకాశం అందరికీ రాదు .. అది నా అదృష్టం. 'కర్తవ్యం' సినిమా నుంచి నాకు సాయికుమార్ పరిచయం. ఒక సమయంలో సాయికుమార్ ను కొడదామని అనుకున్నాను .. నాకు డబ్బింగ్ చెప్పడం లేదని.

'భారత్ బంద్' సినిమా షూటింగు సమయంలో ఒక గమ్మత్తు జరిగింది. కెమెరాను అసెంబ్లీ దగ్గర పెట్టారు. నేను పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ఉన్నాను. షూటింగు స్పాట్ లో ఉన్న వారందరినీ పోలీసులు తీసుకుని పోయారు. నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్ ను అనుకుని నన్ను మాత్రం వదిలేశారు. దాంతో నేను ఆటో పట్టుకుని ఇంటికి వెళ్లిపోయాను. అలా ఈ షోలో వినోద్ కుమార్ చాలా సరాదాగా మాట్లాడుతూనే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖాన్ని దిగమింగుకోవడానికి ప్రయత్నించాడు.

అంతగా ఆయనను కదిలించి వేసిన ఆ సంఘటన ఏమిటి? అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తేనే గాని తెలియదు. అప్పటి వరకూ వెయిట్ చేయవలసిందే.