Begin typing your search above and press return to search.

షాకింగ్ గా మారిన సీనియ‌ర్ న‌టుడి ఫోటో

By:  Tupaki Desk   |   6 April 2017 5:32 PM GMT
షాకింగ్ గా మారిన సీనియ‌ర్ న‌టుడి ఫోటో
X
నాటి బాలీవుడ్ అగ్ర‌న‌టుల్లో ఒక‌రైన వినోద్ ఖ‌న్నాగురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. పాత సినిమాల్ని చూసే వారికి ఆయ‌న సుప‌రిచితుడే. తాజాగా ఆయ‌న‌కు చెందిన ఒక ఫోటో వైర‌ల్ గా మారింది. బ‌లిష్ఠంగా క‌నిపించే ఆయ‌న.. నీర‌సించిపోయి.. ఏ మాత్రం గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో ఉన్న ఫోటో ఒకటి వైర‌ల్ గా మారింది.

ఇటీవ‌ల ఆయ‌న తీవ్ర అనారోగ్యానికి గురైన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న కొంత కాలంగా డీహైడ్రేష‌న్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని.. అందుకే ముంబ‌యిలోని హెచ్ఎన్ రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్లుగా ఆయ‌న కుమారుడు రాహుల్ ఖ‌న్నా వెల్ల‌డించారు. ఆయ‌న చివ‌రిగా న‌టించిన దిల్ వాలే చిత్రంలో క‌నిపించిన దానికి ఏమాత్రం సంబంధం లేని విధంగా.. బ‌క్క‌ప‌ల్చ‌టి ఆకారంతో ఉన్న ఆయ‌న ఫోటోను చూసిన వారంతా షాక్ తింటున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తున్న ఆయ‌న ఫోటోను చూసిన వారికి నోటంట మాట రావ‌టం లేదు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ ఫోటో సంచ‌ల‌నంగా మారింది.

కొన్ని వ‌ర్గాల క‌థ‌నాల ప్ర‌కారం.. వినోద్ ఖ‌న్నా డీహైడ్రేష‌న్‌తో బాధ ప‌డ‌టం లేద‌ని.. ఆయ‌న క్యాన్స‌ర్‌తో ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. వినోద్ ఖ‌న్నాను తాజాగా చూస్తున్న వారంతా.. ఆయ‌న కోలుకోని.. క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఆయ‌న్ను అభిమానించే వారి ఆశీస్సులు ఆయ‌న‌కు శ్రీరామ‌ర‌క్ష‌గా నిలుస్తాయ‌ని అశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/