Begin typing your search above and press return to search.
బాహుబలికి ఇంటర్నేషనల్ కత్తెర
By: Tupaki Desk | 16 July 2015 10:02 PM ISTబాహుబలి విడుదలై వారం అవుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ దుమ్ముదులిపేస్తోంది రాజమౌళి విజువల్ వండర్. కనీసం ఇంకో రెండు వారాలైనా బాక్సాఫీస్ దగ్గర బాహుబలి హంగామా కొనసాగేలా కనిపిస్తోంది. బాహుబలి కోసం మూడు నాలుగేళ్లుగా శ్రమించిన రాజమౌళి అండ్ టీమ్ ప్రస్తుతం రిలాక్స్ అయ్యే మూడ్‌లో ఉంది. ఐతే ఈ విశ్రాంతి ఎన్నో రోజులుండే అవకాశం లేదు. రెండో పార్ట్ మొదలవడానికి ఇంకా రెండు నెలల సమయమున్నప్పటికీ నటీనటులందరూ రెండో పార్ట్‌కు తగ్గట్లు బాడీని మార్చుకోవాల్సి ఉంది. ఇక రాజమౌళి అయితే ఓవైపు స్క్రిప్టు సరి చూసుకోవడంతో పాటు బాహుబలిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే పనిలో తలమునకలవ్వాల్సింది.
ఇప్పటికే ఇంటర్నేషనల్ వెర్షన్ కోసం ప్రముఖ ఎడిటర్ విన్సెంట్ టాబైలాన్‌తో కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. ది ఇన్‌క్రెడిబుల్ హల్క్, క్లాష్ ఆఫ్ టైటాన్స్, టేకెన్-2, నౌ యూ సీ మీ లాంటి ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేశాడు విన్సెంట్. బాహుబలి సినిమాపై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థాయికి తగ్గట్లే ఇంటర్నేషనల్ వెర్షన్ రెడీ చేయాలని బాహుబలి నిర్మాతలు భావించారు. ఇండియన్ వెర్షన్లోని పాటలు తీసేసి.. కొంచెం డ్రామా తగ్గించి ఇంటర్నేషనల్ వెర్షన్ రెడీ చేయబోతున్నారు. భాష తెలుగులోనే ఉంటుంది కానీ.. సబ్ టైటిల్స్ మాత్రం ఆయా దేశాలకు తగ్గట్లు ఉంటాయి. ఎడిట్, సౌండ్ మిక్సింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోబుతున్నారు. ఇంకో నెల రోజుల్లో ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ చేయాలన్న ప్లాన్లో ఉంది బాహుబలి టీమ్.