Begin typing your search above and press return to search.

'వినాయ‌క చ‌వితి కథ' చెప్పిన డైలాగ్‌ కింగ్‌...!

By:  Tupaki Desk   |   21 Aug 2020 11:45 AM IST
వినాయ‌క చ‌వితి కథ చెప్పిన డైలాగ్‌ కింగ్‌...!
X
'డైలాగ్‌ కింగ్‌' 'కలెక్షన్ కింగ్' అని పిలవబడే విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు 'వినాయక చవితి' జరుపుకునే భక్తుల కోసం పూజా విధానాన్ని తెలియజేశారు. రేవు వినాయ‌క చ‌వితి సందర్భంగా 'వినాయ‌క చ‌వితి కథ' పేరుతో ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ వీడియోకు మోహన్ బాబు వాయిస్ అందించడం విశేషం. ''నేను చదవడం వినడం దగ్గర నుండి నేను ప్రతి సంవత్సరం నేను ఇష్టపడే పండుగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండుగ వినాయక చవితి'' అంటూ మోహన్ బాబు 'వినాయక చవితి' పూజా విధానాన్ని.. దాని వెనుక ఉన్న కథను చక్కగా వివరించారు.

కాగా మోహన్ బాబు ఈ వీడియోని షేర్ చేస్తూ.. ''వినాయక చవితి సందర్భంగా గణనాథుడి కథను వివరించే ప్రయత్నం చేశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ స్నేహితుల కోసం దీనిని రూపొందించాను. ఓమ్ గణేశాయ నమ:'' అని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ప్రతి ఏడాది పండుగకు సన్నిహితులను ఆహ్వానించడం తన కుటుంబంలో ఒక సంప్రదాయం అని.. వారికి కుటుంబ సభ్యులతో పాటు గణనాథుడి కథను చెప్తానని పేర్కొన్నారు. గజాసుర కథను.. వినాయకుడి జన్మ కథను.. ఏనుగు తల వెనుక ఉన్న కారణాన్ని మోహన్ బాబు వివరించాడు. వినాయక చతుర్థి పండుగ యొక్క ప్రాముఖ్యతను.. పండుగను జరుపుకోవడం వెనుక కథ గురించి చెప్తూ భక్తులందరికీ ఈ కథ చెప్పడానికి ఈ వీడియో చేయమని తన కొడుకులు సలహా ఇచ్చారని మోహన్ బాబు వెల్లడించారు.