Begin typing your search above and press return to search.

ఖైదీ దర్శకుడికి తారక్ కాల్ చేశాడా?

By:  Tupaki Desk   |   20 Jan 2017 5:34 PM IST
ఖైదీ దర్శకుడికి తారక్ కాల్ చేశాడా?
X
సంక్రాంతి సందర్భంగా విడుదలయైన చిరంజీవి 150వ సినిమా, బాలయ్య వందో సినిమాలకు సంబందించిన ప్రతీ విషయమూ హాట్ టాపిక్ అనే చెప్పాలి! ఈ క్రమంలో ఒకరోజు తేడాలో విడుదలయిన ఈ రెండు సినిమాలూ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆ సంగతులు అలా ఉంటే... ఈ సినిమాలపై ఎవరెవరు స్పందించారు.. ఎలా స్పందించారు అనే విషయాలపై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతుంది.

ఈక్రమంలో "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమాపై దాదాపు అంతా స్పందించారు.. మరి ఎన్టీఆర్ స్పందించారా? అని ప్రశ్నలు రావడం... ఈ విషయాలపై క్రిష్ తో కలిసి జూనియర్ సినిమా చూడటం, అనంతరం "తెలుగువాడి గొప్పతనాన్ని చాటిన చిత్రం శాతకర్ణి" అని కొనియాడటం తెలిసిందే. దాంతో బాబాయ్ సినిమాపై తారక్ స్పందనపై గతంలోనే క్లారిటీ వచ్చేసింది. ఆ సంగతి అలా ఉంటే... తారక్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన వినాయక్ దర్శకత్వం వహించిన "ఖైదీ నంబరు 150"పై కూడా జూనియర్ స్పందించాడా? అని మరో ప్రశ్న తాజాగా వినాయక్ కే ఎదురయ్యింది. ఈ విషయాలపై తాజాగా ఒక ఇంటర్వులో వినాయక్ స్పందించాడట!

ఖైదీ సినిమా గురించి తారక్ స్పందించాడా అన్న ప్రశ్నపై స్పందించిన వినాయక్... ప్రతి ఒక్కరూ స్పందించాలన్న రూల్ ఏం లేదని మొదలుపెట్టి, సినిమా విడుదలయ్యే ముందు రోజు తారక్ తనకు ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పాడని క్లారిటీ ఇచ్చాడట. ఇదే క్రమంలో విడుదల అనంతరం కూడా కలెక్షన్లు అద్భుతంగా వస్తుండడంతో కంగ్రాట్స్ కూడా చెప్పాడని వినాయక్ అన్నాడట. సో... సంక్రాంతికి విడుదలయిన తన స్నేహితుడు దర్శకత్వం వహించిన సినిమాపై తారక్ స్పందించినట్లేనన్నమాట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/