Begin typing your search above and press return to search.
ఫేడవుట్ డైరెక్టర్లకు అగ్రహీరో ఊతమిస్తున్నారా?
By: Tupaki Desk | 4 Oct 2020 11:00 AM ISTఫ్యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన చరిత్ర నందమూరి బాలకృష్ణకే ఉంది. అయితే ఇటీవల ఆయన కెరీర్ గాడి తప్పింది. ఒక్క హిట్టు కోసం పరితపించాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. మళ్లీ ఓ మాసీవ్ హిట్‌తో రేసులోకి దూసుకురావాలన్న పంతం కనిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ మాస్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. మహమ్మారీ వల్ల చిత్రీకరణ వాయిదా పడిన సంగతి విధితమే. తాజా సమాచారం ప్రకారం.. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభిం కాబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే.. బాలయ్య తదుపరి చిత్రంపై వేడెక్కించే అప్ డేట్ అందింది. ఈసారి కూడా క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకీ మూగ్గురు బి(బిబిబి)లు కలిసి పనిచేయబోతున్నారట. సమరసింహారెడ్డి.. నరసింహానాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ లని అందించిన బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీ చేయడానికి కమిటయ్యారట. ఈ చిత్రానికి స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ కథ మాటలు అందిస్తున్నారు.
బాలయ్యకు తగ్గ పవర్ ఫుల్ స్టోరీని సాయి మాధవ్ బుర్రా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు బాలయ్యకు బి. గోపాల్ ఓ కథ వినిపించారట. అది ఏమంతగా ఆకట్టుకోకపోవడంతో.. దాన్ని పక్కన పెట్టి సాయి మాధవ్ ని బరిలో దించారట. పవర్ ఫుల్ స్టోరీని ఇప్పటికే రెడీ చేసిన సాయిమాధవ్ బుర్రా త్వరలో ఈ కథని బాలయ్యకు చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఇదే గాక.. మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ కూడా బాలకృష్ణ కోసం ఓ స్క్రిప్ట్ ని రెడీ చేయిస్తున్నారని ఇటీవల లీకులు అందిన సంగతి తెలిసిందే.