Begin typing your search above and press return to search.

వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్

By:  Tupaki Desk   |   5 Feb 2019 5:21 AM GMT
వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్
X
రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' భారీ అంచనాల నడుమ సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ రూ. 92 కోట్లు కాగా ఫుల్ రన్ లో రూ.62.64 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే రాబట్టగలిగింది. ముప్పై కోట్ల నష్టాలతో డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా ఉత్తరాంధ్ర.. ఈస్ట్ గోదావరి.. వెస్ట్ గోదావరి.. నెల్లూరు ఏరియాలలో మెరుగైన కలెక్షన్స్ వసూలు చేసింది. నైజామ్ వసూళ్లు మాత్రం మిగతా ఏరియాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సినిమా నైజామ్.. ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ.32 కోట్లకు దిల్ రాజు తీసుకున్నారు. ఆయనకు ఈ సినిమాతో దాదాపు రూ.11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో ఈ సినిమా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా 'వినయ విధేయ రామ' క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 12.58 cr

సీడెడ్: 11.92 cr

ఉత్తరాంధ్ర: 8.51 cr

కృష్ణ: 3.69 cr

గుంటూరు: 6.36 cr

ఈస్ట్ : 5.42 cr

వెస్ట్: 4.42 cr

నెల్లూరు: 2.89 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 55.79 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.40 cr

ఓవర్సీస్: 1.45 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 62.64 cr