Begin typing your search above and press return to search.

హాలీవుడ్డోళ్ళు కూడా దీపావళిని వాడేశారు

By:  Tupaki Desk   |   30 Oct 2016 9:36 AM GMT
హాలీవుడ్డోళ్ళు కూడా దీపావళిని వాడేశారు
X
ఇప్పుడు దీపావళి పండుగ వచ్చింది కాబట్టి.. దీపాల వెలుగు సాక్షిగా.. విరజిల్లే టపాసుల కాంతుల సాక్షిగా.. తెలుగు సినిమాల వారు చాలామంది దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇది కేవలం మన ఇండియన్ సినిమావారే కాదు.. హాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పుడు ఇండియన్ ప్రేక్షకులకు దీపావళి విషెస్ చెబుతున్నాయి.

XXX: Return of Xander Cage సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు హాలీవుడ్ హీరో విన్ డీజిల్. మనోడు ఎలాగో దీపికా పదుకొనె ను హీరోయిన్ గా తీసుకున్నాడు కాబట్టి.. ఇప్పుడు ఇండియాలో పారామౌంట్ పిక్చర్స్ వారు సినిమాను ఓ రేంజులో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే వచ్చిరాని హిందీలో విన్ డీజిల్ కూడా.. ''నమస్తే.. ఆప్ సబ్ కో దీపావళి కి శుభ్ కామ్నా'' అంటూ కాస్త కామెడీగా విషెస్ చెప్పాడు. వెంటనే పక్కనే ఉన్న దీపిక.. అసలైన పండుగ జనవరి 20న XXX సినిమా విడుదలైనప్పుడు వస్తుందని చెప్పింది.

దీపావళికి విషెస్ చెప్పడం బాగానే ఉంది.. కాకపోతే ఏదో నేషనల్ డ్యూటి చేస్తున్నట్లు వీళ్లు బిల్డప్ ఇస్తున్నారు చూడండి.. వామ్మో అదే కాస్త తట్టుకోలేం. సర్లేండి.. మన మార్కెట్ కు ఎంత రేంజ్ ఉంది అనే విషయం ఈ హాలీవుడ్ సినిమాల భారతీయాత్మత ప్రమోషన్లను చూసి మనం అర్ధం చేసుకోవచ్చు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/