Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోను ఇలా ఎప్పుడైనా చూశారా?

By:  Tupaki Desk   |   19 July 2016 6:03 PM GMT
ఆ స్టార్ హీరోను ఇలా ఎప్పుడైనా చూశారా?
X
కాస్త పోల్చుకుని చూసి.. ఈ ఫొటోలో ఉన్న‌దెవరో గుర్తు ప‌ట్టడానికి ప్ర‌య‌త్నించండి. ఎక్క‌డో చూసిన‌ట్లే అనిపిస్తుంది కానీ. గుర్తు ప‌ట్ట‌డం అంత సులువు కాదు. ఇత‌నో హాలీవుడ్ సూప‌ర్ స్టార్. కాక‌పోతే ఇది కుర్రాడిగా ఉన్న‌పుడు తీసిన ఫొటో అన్న‌మాట‌. ఇప్పుడు ఈ అవ‌తారానికి పూర్తి భిన్న‌మైన లుక్ లో ఉంటాడు. కండ‌లు తిరిగిన శ‌రీరంతో.. ఎప్పుడూ గుండుతో క‌నిపిస్తాడు. యాక్ష‌న్ సినిమాల‌కు బాగా ఫేమ‌స్ అయిన ఈ సూప‌ర్ స్టార్ ఎవ‌రో ఇప్ప‌టికైనా గుర్తుప‌ట్ట‌గ‌లిగారా..? సాధ్యం కాకుంటే కింది పేరాలోకి వెళ్లిపోండి.

పై ఫొటోలో ఉన్నది హాలీవుడ్ సూప‌ర్ స్టార్ విన్ డీజిల్. మంగ‌ళ‌వారం విన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానులు అత‌డి పాత ఫొటో ఒక‌టి సంపాదించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. విన్ డీజిల్ ప్ర‌స్తుతం ట్రిప్లెక్స్ మూడో భాగంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌న దీపికా ప‌దుకొనేనే క‌థానాయిక‌. దీపిక విన్ కు ట్విట్ట‌ర్లో శుభాకాంక్ష‌లు కూడా చెప్పింది.

విన్ డీజిల్ అస‌లు పేరు మార్క్ సింక్లెయిర్. తండ్రి ఎవరో తెలియ‌ని పరిస్థితుల్లో త‌ల్లికి కూడా దూర‌మై త‌న పిన్ని ఇంట్తో పెరిగిన విన్ డీజిల్ చిన్న‌త‌నంలో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు. స్కూల్లో కాలేజీలో స్టేజ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుని సినిమాల వైపు అడుగులేశాడు. కష్టానికి తోడు అదృష్టం కలిసొచ్చింది. విన్ డీజిల్ ప్ర‌స్తుతం హాలీవుడ్ సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డు. 1990లో హాలీవుడ్ లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి డీజిల్ గుండుతోనే క‌నిపిస్తున్నాడు. 26 ఏళ్లుగా జుట్టు పెంచుకోలేదు. ట్రిప్లెక్స్-3 సినిమాకు అత‌ను హీరో మాత్రమే కాదు. నిర్మాత కూడా కావ‌డం విశేషం.