Begin typing your search above and press return to search.

అమ్మడి సీక్రెట్ ను ఓపెన్ చేసేశాడు

By:  Tupaki Desk   |   16 Jan 2017 4:29 AM GMT
అమ్మడి సీక్రెట్ ను ఓపెన్ చేసేశాడు
X
అందరికి తెలిసిన విషయమే. కానీ.. ఎవరికీ తెలీదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు బాలీవుడ్ ప్రేమజంట దీపికా.. రణవీర్ లు. కొన్నేళ్లుగా ఘాటు ప్రేమాయణం వారిద్దరి మధ్య నడుస్తున్నా.. ఆ విషయాల గురించి ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడింది లేదు. అసలు తమ మధ్యన ఏదో ఉందన్న భావన కలిగేలా కూడా వారు వ్యవహరించరు. ఇన్నాళ్లు గుట్టుగా నడిపించేసిన వీరి వ్యవహారం.. తాజాగా బయటపడిపోయింది.

దీపిక.. రణ్ వీర్ సింగ్ ల మధ్య ఏదో నడుస్తుందన్న విషయం అందరికి తెలిసినా.. దీపిక నోరు విప్పలేదు. సరదాగా ఫారిన్ టూర్లకు ఈ జంట వెళ్లి రావటం లాంటివి ఎన్ని బయటకు వచ్చినా.. అసలా విషయాల్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించే వారు వీరిద్దరు. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరి మధ్య యవ్వారాన్ని ఓపెన్ చేశారు హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్.

ట్రిపుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ మూవీలో దీపికకు ఛాన్స్ రావటం తెలిసిందే. విన్ డీజిల్ సరసన నటిస్తున్నట్లుగా ప్రచారం జరిగినప్పటికీ.. అలాంటిదేమీ లేదని.. గుంపులో గోవింద బ్యాచేనన్న విషయం సినిమా విడుదలయ్యాక తేలింది. కాకుంటే.. మిగిలిన వారితో పోలిస్తే.. కాస్త ప్రాధాన్యత లభించే పాత్రను ఆమె పోషించారు. ఈ సినిమా హాలీవుడ్ కంటే భారత్ లో వారం ముందుగా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియా వచ్చిన విన్ డీజిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాను దీపిక బాయ్ ఫ్రెండ్ రణ్ వీర్ సింగ్ చూశారని.. చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. అందరి ముందు విన్ డీజిల్ అలా అనటంతో దీపిక షాక్ తిన్నట్లు చెబుతున్నారు. కాకుంటే.. ఆ ఫీలింగ్స్ బయటకు రానివ్వకుండా అతి కష్టమ్మీదా దీపిక కవర్ చేసినట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/