Begin typing your search above and press return to search.

హాలీవుడ్ దీపిక.. కెవ్వు కేక

By:  Tupaki Desk   |   5 Feb 2016 7:23 AM GMT
హాలీవుడ్ దీపిక.. కెవ్వు కేక
X
హాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ బ్యూటీ.. ఈ థాట్ కూడా సూపర్ అనాల్సిందే. ఇప్పటివరకూ మన భామలు హాలీవుడ్ సినిమాల్లో మెరిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిన్న చితకా పాత్రలే కాకుండా.. ఐశ్వర్య రాయ్ లాంటి కొందరు భామలు లీడ్ హీరోయిన్ గా కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. అయినాసరే.. దీపికా పదుకొనే హాలీవుడ్ ఎంట్రీ సంథింగ్ స్పెషల్ అనాల్సిందే. ఫుల్ ప్లెడ్జెడ్ యాక్షన్ మూవీతో హాలీవుడ్ ని అదరగొట్టేందుకు వెళ్లిందీ బాలీవుడ్ బ్యూటీ.

విన్ డీజిల్ సరసన ట్రిపుల్ ఎక్స్ సిరీస్ మూడో భాగంలో దీపిక నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా. ఇదుగో ఇప్పుడిలా దీపిక - విన్ డీజిల్ ల ఫస్ట్ లుక్ వచ్చింది. యాక్షన్ పాక్డ్ హీరో విన్ డీజిల్ కు సరిజోడీగా అదరగొట్టేస్తోంది కదూ. ఇందులో దీపికా పదుకొనేకి కూడా చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఒక్క బాలీవుడ్ కూడా సైన్ చేయకుండా.. డేట్స్ ఖాళీగా ఉంచింది దీపిక.

దాదాపు జూన్ వరకూ ట్రిపుల్ ఎక్స్3 షూటింగ్ దీపిక పాల్గొంటుంది. అక్కడితే ఈమె వెర్షన్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. యాక్షన్ మూవీతో ఎంట్రీ ఇచ్చి, హాలీవుడ్ లో కూడా పాతుకుపోవాలన్నది దీపిక ఐడియా అంటున్నారు. ఫస్ట్ లుక్ తోనే చాలా మందిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. హాలీవుడ్ తగ్గట్లుగా బాడీని మౌల్డ్ చేసేసుకుంది ఇప్పటికే.