Begin typing your search above and press return to search.

హాలీవుడ్ హీరోతో ఏం చేయించిందో చూడండి

By:  Tupaki Desk   |   17 Jan 2017 10:25 AM GMT
హాలీవుడ్ హీరోతో ఏం చేయించిందో చూడండి
X
బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొనేలో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇంకెవరిలోనూ కనిపించదంటారు. ఆమె ఏ హీరోతో నటిస్తే ఆ హీరోకు నిజమైన ప్రేయసిలాగా ఒదిగిపోతుంటుంది. హీరోలతో కెమిస్ట్రీ పండించడంలో ఆమెకు తిరుగులేదని పేరుంది. తొలిసారి ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తూ కూడా ఏమాత్రం బెరుకు లేకుండా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది దీపిక. ‘ట్రిప్లెక్స్’ మూవీలో ఆమె పాత్ర పరిమితమే అయినప్పటికీ.. ఉన్నంతసేపూ దీపిక ఆకట్టుకుంది. విన్ డీజిల్ తో కెమిస్ట్రీ అదరగొట్టేసింది. ఈ సినిమా కోసం ప్రమోషన్లలో విన్ డీజిల్ తో దీపిక రాసుకుపూసుకు తిరిగిన వైనం కూడా చర్చనీయాంశమైంది.

ముంబయిలో జరిగిన ప్రిమియర్ షోలో విన్ డీజిల్ పక్కన దీపిక చేసిన క్లీవేజ్ షో.. అతడితో కలిసి చేసిన లుంగీ డ్యాన్స్ పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా దీపిక చేసిన మరో పని అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా రోడ్ సైడ్ ఓ టీ కొట్టులోకి విన్ డీజిల్ ను తీసుకెళ్లిన దీపిక.. అతడితో ఛాయ్ తాగించింది. మన లోకల్లో ఉపయోగించే గాజు టీ గ్లాసులో డీజిల్ టీ తాగుతుంటే చూసే వాళ్లకు భలే చిత్రంగా అనిపించింది. ఆ సందర్భంగా డీజిల్.. దీపికల కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందిలెండి. సొంత భర్తకు ఇంట్లో టీ పెట్టి ఇస్తే ఇద్దరూ కలిసి ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫొటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి ప్రస్తుతం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/