Begin typing your search above and press return to search.

కోబ్రా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న విక్రమ్

By:  Tupaki Desk   |   31 Aug 2022 5:32 AM GMT
కోబ్రా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న విక్రమ్
X
సూపర్ స్టార్లుగా వెండితెర మీద వెలిగిపోయే వారిలో సరైన సీన్ ఇచ్చి.. నటించి చూపించమంటే చాలు.. చిన్నబోయే ముఖంతో ఉండిపోయే వారెందరో. దీనికి భిన్నంగా పాత్ర ఏదైనా.. సీన్ మరేదైనా.. నటించటం అంటే ఇది కదా? అన్న రీతిలో పాత్రలోకి ఒదిగిపోయి..

నిజంగానే జరుగుతుందన్నట్లుగా జీవించే నటుడు కోలీవుడ్ అగ్ర హీరో విక్రమ్ చియాన్. రోటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా.. తాను చేసే ప్రతి సినిమాను ఒక మాస్టర్ పీస్ మాదిరి తీర్చి దిద్దేందుకు తెగ ప్రయత్నిస్తుంటాడు విక్రమ్. తమిళ నటుడిగా సుపరిచితుడైనప్పటికీ..అతడి సినిమాలకు తెలుగు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంది.

దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన మూవీ ఒకటి తాజాగా థియేటర్లలో సందడి చేస్తోంది. వినాయకచవితి వేళ.. పండుగ రోజునే విడుదలైన ఆయన మూవీ కోబ్రా. ఈ సినిమా ప్రత్యేకత ఏమంటే.. దాదాపు పది రూపాల్లో ఆయన ఈ సినిమాలో కనిపిస్తారు.

భారీగా రూపొందించిన ఈ మూవీ మీద పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈ రోజు (ఆగస్టు 31)న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి వేళలో.. చాలాచోట్ల ప్రీమియర్ షోలు వేశారు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం విక్రమ్ తీసుకున్న పారితోషికం భారీగా ఉన్నట్లు చెబుతున్నారు.

తన గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమా కోసం ఆయన రూ.25 కోట్లు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో విక్రమ్ కష్టం తెలిసిన నిర్మాత.. ఆయన అడిగినంత మొత్తాన్ని ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ మూవీ బడ్జెట్ లో విక్రమ పారితోషికమే 22 శాతం ఉన్నట్లు చెబుతున్నారు.

యాక్షన్ ప్రియులకు ఈ మూవీ విందు భోజనంగా అభివర్ణిస్తున్నారు. విక్రమ్ మార్కు నటన ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్న సినిమా టీం మాటలకు తగ్గట్లే.. ప్రాథమికంగా వస్తున్న రిపోర్టులు అదే విషయాన్ని ఖరారు చేస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి.. విక్రమ్ కు జత కట్టింది. ఈ సినిమాను అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.