Begin typing your search above and press return to search.

అభిమానుల కోసం విక్ర‌మ్‌ వీడియో సందేశం

By:  Tupaki Desk   |   10 July 2022 6:27 AM GMT
అభిమానుల కోసం విక్ర‌మ్‌ వీడియో సందేశం
X
స్టార్ హీరో విక్ర‌మ్ త‌న‌దైన విక్ష‌ణ న‌ట‌న‌తో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న అక‌స్మాత్తుగా హాట్ ఎటాక్ కు గుర‌య్యార‌ని, శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చెన్నైలోని కావేరి హాస్ప‌ట‌ల్ లో చేర్చారంటూ వార్త‌లు వినిపించాయి. గుండె వాల్స్ బ్లాక్ కావ‌డం వ‌ల్లే ఆయ‌న తీవ్ర ఆస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారంటూ మ‌రిన్ని వార్త‌లు పుట్టుకోచ్చాయి. దీంతో అభిమానులు తీవ్ర భయాందోళ‌న‌కు గుర‌య్యారు. అభిమాన హీరోకు ఏం జ‌రిగింది అంటూ నెట్టింట ఆరాతీయ‌డం మొద‌లు పెట్టారు.

అయితే విక్ర‌మ్ కు ఎలాంటి హార్ట్ ఎటాక్ రాలేద‌ని, ఆయ‌న చాతిలో తీవ్ర అస్వ‌స్థ‌త కార‌ణంగానే హాస్పిట్ లో చేరార‌ని, ప్ర‌త్యేక డాక్ట‌ర్ల బృందం ఆయ‌న‌కు ట్రీట్ మెంట్ ఇస్తున్నార‌ని, త్వ‌ర‌లో ఆయ‌న డిశ్చార్జ్ అవుతార‌ని చెన్నై కావేరి హాస్పిట‌ల్ కు చెందిన డాక్ట‌ర్లు హెల్త్ బులిటిన్ విడుద‌ల చేయ‌డంతో అభిమానుల‌తో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఊపిరి పీల్చుకున్నారు. విక్ర‌మ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుకున్నారు.

ఇదిలా వుంటే త‌న తండ్రి హెల్త్ పై వ‌స్తున్న రూమ‌ర్ ల‌పై హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటుగా స్పందించారు. త‌న తండ్రికి ఏమీ కాలేద‌ని, ఆయ‌న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చిందంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఈ వార్త‌లు మా ఫ్యామిలీని ఎంతో బాధించాయ‌ని, చిన్న‌పాటి చెస్ట్ పెయిన్ రావ‌డంతో నాన్న హాస్పిట‌ల్ లో చేరార‌ని, మా కుటుంబానికి కాస్త ప్రైవ‌సీని ఇవ్వండ‌ని విక్ర‌మ్ పై వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టారు.

శ‌నివారం డిశ్చార్జ్ అయిన విక్ర‌మ్ అభిమానుల‌ని ఉద్దేశించి వీడియో సందేశాన్ని అందించారు. `హాయ్ పీపుల్‌.. అంటూ అంతా త‌న‌పై ప్రేమ‌ని, కేర్‌ని, ఆప్యాయ‌త‌ని చూపించిన తీరుకు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. మీరంతా నా వెంట వుంటూ నాపై చూపించిన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. మీ ఆద‌రాభిమానాలు, ఆప్యాయ‌త‌, ప్రేమ వ‌ల్లే నేను ఇప్పుడు ఇలా వున్నాను`అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. విక్ర‌మ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న పీరియాడిక‌ల్ మూవీ `పొన్నియిన్ సెల్వ‌న్ 1` టీజర్ శుక్ర‌వారం విడుద‌లై మంచి స్పంద‌న సొంతం చేసుకున్న విష‌యం తెలిప‌సిందే. మ‌ణిర‌త్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఐదు భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేయ‌బోతున్నారు.