Begin typing your search above and press return to search.

ఫ్లాప్ రీమేక్ కి సీక్వెల్‌ చర్చలు నిజమా?

By:  Tupaki Desk   |   2 Oct 2022 11:30 AM GMT
ఫ్లాప్ రీమేక్ కి సీక్వెల్‌ చర్చలు నిజమా?
X
తమిళ హిట్ చిత్రం విక్రమ్‌ వేదా కి హిందీలో అదే పేరుతో రీమేక్ వచ్చిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హృతిక్‌ రోషన్ మరియు స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కలిసి నటించడం వల్ల విక్రమ్‌ వేదా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల విడుదల అయిన విక్రమ్‌ వేదా హిందీ వర్షన్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.

ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు పెద్దగా ఓపెనింగ్స్ ను రాబట్టలేక పోతున్నాయి.. లాంగ్‌ రన్‌ లో కూడా బ్రేక్ ఈవెన్‌ ను సాధించలేక పోతున్నాయి. ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. పైగా ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్‌ గా ఏమీ రాలేదు. అయినా కూడా విక్రమ్‌ వేదా కి సీక్వెల్‌ చేస్తామంటూ ప్రకటన వచ్చింది.

హిందీలో విక్రమ్‌ వేదా కి వస్తున్న స్పందన చూస్తే చిత్ర యూనిట్‌ సభ్యులు తీవ్ర నిరాశలో ఉండి ఉంటారు అని అంతా అనుకుంటున్నారు. కానీ వారికి పెద్దగా నిరాశగా ఉన్నట్లుగా లేదు. పైగా వారు విక్రమ్‌ వేదా యొక్క సీక్వెల్ ను ప్లాన్‌ చేస్తున్నామని మీడియా వద్ద అనధికారికంగా చెప్పడం ఒకింత ఆశ్చర్యంను కలిగిస్తుంది.

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌ లో సౌత్‌ రీమేక్ లు బొక్క బోర్లా పడుతున్నాయి. అయినా కూడా వరుసగా రీమేక్ ల మీదే ఉత్తరాది ఫిల్మ్‌ మేకర్స్ పడుతున్నారు. వరుసగా రీమేక్ లు చేస్తున్నారు. ఇప్పుడు రీమేక్ కి సీక్వెల్‌ ను కూడా విక్రమ్‌ వేదా సీక్వెల్‌ 2 ద్వారా తీసుకు వస్తున్నారు. సీక్వెల్‌ లో కూడా ఈ ఇద్దరు హీరోలు నటిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సీక్వెల్‌ గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.