Begin typing your search above and press return to search.

విజ‌య్‌, య‌ష్ థియేట‌ర్ల‌లో క‌మ‌ల్ హంగామా

By:  Tupaki Desk   |   14 April 2022 6:01 PM IST
విజ‌య్‌, య‌ష్ థియేట‌ర్ల‌లో క‌మ‌ల్ హంగామా
X
క్రేజీ చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంటే ఆ థియేట‌ర్ల‌ని త‌మ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ల‌కు వేదిక‌లుగా చేసుకుంటున్నారు. ఇటీవ‌ల ఇటీవ‌ల ట్రిపుల్ ఆర్, బీస్ట్ చిత్రాల థియేట‌ర్ల‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన క్రేజీ మూవీ `ఆచార్య‌` ట్రైల‌ర్ ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో మ‌రో సీనియ‌ర్ హీరో క‌మ‌ల్ హాస‌న్ తాజా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ గ్లాన్స్ ని రిలీజ్ చేశారు. వివ‌రాల్లోకి వెళితే... సీనియ‌ర్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విక్ర‌మ్‌`.

రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై క‌మ‌ల్ హాస‌న్‌, ఆర్ . మ‌హేంద్ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఖైదీ`, మాస్ట‌ర్ చిత్రాల ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ మూవీని తెర‌కెక్కించారు. విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించారు. చాలా ఏళ్ల విరామం త‌రువాత న‌టి మ‌హేశ్వ‌రి ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. 1986 లో వ‌చ్చి `విక్ర‌మ్` చిత్ర టైటిల్ సాంగ్ ని ఈ మూవీ కోసం రీ మిక్స్ గా తీసుకున్నారు.

ఫ‌స్ట్ లుక్ నుంచి ఆస‌క్తిని రేకెత్తిస్తూ భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని జూన్ 3న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. క‌మ‌ల్ హాస‌న్ ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా నుంచి మ‌రో అప్ డేట్ ని మేక‌ర్స్‌ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి స‌డ‌న్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.

తాజాగా ఫ‌స్ట్ గ్లాంన్స్ పేరుతో ఈ మూవీ నుంచి మ‌రో వీడియోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బీస్ట్‌, కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న థియేట‌ర్ల‌లో తాజా వీడియో ని రిలీజ్ చేశారు. సెల్లోంచి ఖైదీలు త‌ప్పించుకునే క్ర‌మంలో పోలీసుల‌పై దాడి చేస్తున్న దృశ్యాల‌తో ఈ వీడియో మొద‌లైంది. పేలుతున్న తూటాల మ‌ధ్య ఇనుప క‌వ‌చాల‌ని ధ‌రించి క‌మ‌ల్ ఎంట్రీ ఇచ్చిన తీరు ఆక‌ట్టుకుంటోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రెడ్ జైంట్ మూవీస్ బ్యాన‌ర్ పై హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ త‌మిళ నాడు అంత‌టా రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ మూవీపై క‌మ‌ల్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌.

https://twitter.com/RKFI/status/1514204552601382919?cxt=HHwWjsCtsZPBxIMqAAAA