Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డిని వద్దనేంత పెద్దోడా??

By:  Tupaki Desk   |   29 Jan 2018 2:30 PM GMT
అర్జున్ రెడ్డిని వద్దనేంత పెద్దోడా??
X
టాలీవుడ్ లోనే కాదు.. దేశంలోని సినిమాల్లోనే బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచే పాత్రగా అర్జున్ రెడ్డి నిలిచిపోతుందని.. సినిమా జనాలతో పాటు ఆడియన్స్ కూడా పొగిడేశారంటే.. ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్ధమవుతుంది. అంతగా అర్జున్ రెడ్డి జనాలకు ఎక్కేయగా.. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు పలు భాషల నుంచి తీవ్రంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ కు వర్మ అనే టైటిల్ అనౌన్స్ చేయగా.. ఈ సినిమా ద్వారా చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్.. హీరోగా పరిచయం అవుతాడని ప్రచారం జరిగింది. బాల దర్శకత్వంలో రూపొందుతుందని అన్నారు. తన కొడుకు కాకుంటే.. తనే ఈ సినిమాలో నటించాలని భావించినట్లు విక్రమ్ కూడా చెప్పాడు. ఇంతలోనే.. ఈ వర్మలో తాను నటించబోవడం లేదని తేల్చేశాడట ధృవ్. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో లాంఛింగ్ అయ్యే అవకాశం అందరికీ రాలేదు. అలాంటి అపురూపమైన ఛాన్స్ ను ధృవ్ వద్దన్నాడని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.

అయితే.. ప్రస్తుతం విదేశాలలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్న ధృవ్ మాత్రం.. ప్రస్తుతం తన దృష్టి అంతా కోర్సు పైనే ఉందని.. ఇప్పుడప్పుడే సినిమాలు మొదలు పెట్టనని చెప్పేశాడట. అయితే.. విక్రమ్ మాత్రం ఇటు లాంఛింగ్ పూర్తి చేసేసిన తర్వాత కోర్సు చేయమని సూచించినా.. సరే అనేశాడట. వర్మ కోసం దాదాపుగా అంతా సిద్ధం అయిపోవడంతో.. ఈ లక్కీ ఛాన్స్ ఎవరికి అందుతుందో అని కోలీవుడ్ జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.