Begin typing your search above and press return to search.

హార్ట్ ఎటాక్ వార్త‌ల‌పై విక్రమ్ రిప్లై అదిరిపోయిందిగా

By:  Tupaki Desk   |   12 July 2022 5:30 AM GMT
హార్ట్ ఎటాక్ వార్త‌ల‌పై విక్రమ్ రిప్లై అదిరిపోయిందిగా
X
త‌మిళ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వ‌న్' ని తెర‌పైకి తీసుకురావాల‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చారు. బ‌డ్జెట్ కార‌ణంగా ఇవ్వెస్ట‌ర్స్ రాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ గ‌త కొన్నేళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ వారు రంగంలోకి దిగ‌డం, మ‌ణిర‌త్నం మ‌ద్రాస్ టాకీస్ తో క‌లిసి నిర్మాణానికి పూనుకోవ‌డంతో మ‌ణిర‌త్నం క‌లల ప్రాజెక్ట్ ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్కింది. చియాన్ విక్ర‌మ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు.

'పొన్నియిన్ సెల్వ‌న్ -1' టీజ‌ర్ ని శుక్ర‌వారం సాయంత్రం చెన్నైలో భారీగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే అదే రోజు స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ కు హ‌ఠాత్తుగా శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని, ఆయ‌న‌ని చెన్నైలోని కావేరి హాస్పిట‌ల్ లో ఆయ‌న కుటుంబ స‌భ్యులు చేర్పించార‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. శుక్ర‌వారం సాయంత్రం 'పొన్నియిన్ సెల్వ‌న్ -1' టీజ‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా ఇలాంటి వార్త వినాల్సి వ‌చ్చింది ఏంటని విక్ర‌మ్ ఫ్యాన్స్ తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

విక్ర‌మ్ త్వ‌ర‌లో కోలుకోవాలంటూ ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుకుంటూ ట్వీట్ చేశారు. అయితే విక్ర‌మ్ కు ఎలాంటి హార్ట్ ఎటాక్ రాలేద‌ని, ఆయ‌న‌కు చాతిలో నొప్పి కార‌ణంగానే హాస్పిట‌ల్ లో చేరార‌ని, స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల బృందం ఆయ‌న‌కు ప్ర‌త్యేక చికిత్స‌ని అందిస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న డిశ్చార్జ్ అవుతార‌ని కావేరి హాస్పిట‌ల్ వ‌ర్గాలు హెల్త్ బులెటిన్ ని విడుద‌ల చేసి రూమ‌ర్ ల‌కు చెక్ పెట్టారు. ఇదే విష‌య‌మై విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ కూడా స్పందించాడు.

నాన్నికు ఎలాంటి ఆరోగ్య స‌మస్య‌లు లేవ‌ని, హార్ట్ ఎటాక్ కు ఆయ‌న గురి కాలేద‌ని, చాతిలో నొప్పి కార‌ణంగానే ఆయ‌న ఆసుప‌త్రిలో చేరార‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా త‌ప్పుడు ప్ర‌చారంపై మండిప‌డ్డారు. నాన్నికు హార్ట్ ఎటాక్ అని చేసిన ప్ర‌చారం బాధించింద‌ని, మా కుటుంబానికి ప్రైవ‌సీని ఇవ్వండి అంటూ ఘాటుగా స్పందించాడు. ఇదిలా వుంటే సోమ‌వారం త‌ను న‌టించిన 'కోబ్రా' మూవీ ఆడియో లాంచ్ లో విక్ర‌మ్ పాల్గొని షాక్ ఇచ్చారు. స్టేజ్ పైకి వెళ్లి చాలా కూల్ గా చిరున‌వ్వులు చిందిస్తూ విక్ర‌మ్ ఫ్యాన్స్ తో మాట్లాడిన వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

త‌న‌కు హార్ట్ ఎటాక్ అంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఈ సంద‌ర్భంగా హీరో విక్ర‌మ్ సెటైర్లు వేశారు. నా ఆరోగ్యం గురించి ఏవేవో వార్త‌లు రాశారు. నేను కొన్ని యూట్యూబ్ థంబ్ నైల్స్ చూశా.. ఎవ‌రో పేషెట్ బాడీకి నా త‌ల అతికించి క్రియేటివిటీని చూపించారు. బాగుంది' అంటూ న‌వ్వారు.

ఇదిలో నేను ఇలా వున్నాను. ఈ రోజు మీ ముందు నిల‌బ‌డ్డాను. నాపై ప్ర‌చారం చేసినందుకు సంతోషం. ఏమీ ఫ‌ర‌వాలేదు. అయితే అవ‌న్నీ చూసి చాలా మంది బాధ‌ప‌డ్డారు. వాళ్లంద‌రికి నేను చెబుతున్న‌ది ఒక్క‌టే 'నేను బాగానే వున్నాను. నా పై చూపించిన మీ ప్రేమ‌కు థాంక్యూ' అంటూ విక్ర‌మ్ త‌న‌దైన స్టైల్లో కూల్ గా స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింటి సంద‌డి చేస్తోంది.